ETV Bharat / bharat

కేరళలో కుండపోత.. శబరిమల దర్శనం నిలిపివేత

author img

By

Published : Nov 20, 2021, 10:39 AM IST

భారీ వర్షాల కారణంగా శబరిమల (sabarimala news) దర్శనం శనివారం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పంబ సహా.. ఇతర ప్రధాన నదులలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో యాత్రికులను అనుమతించట్లేదని పతనంతిట్ట జిల్లా పాలనాధికారి ఉత్తర్వులు జారీచేశారు.

SABARIMALA
శబరిమల

పంబ, శబరిమల ఆలయ (sabarimala temple) దర్శనాలను శనివారం నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల (kerala rain news) కారణంగానే యాత్రికులను అనుమతించట్లేదని తెలిపిన కేరళ ప్రభుత్వం.. భక్తులంతా సహకరించాలని కోరింది.

"పతనంతిట్ట జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పంపా నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అంతేగాక కక్కి- అనతోడ్ రిజర్వాయర్ గేట్లు ఎత్తినందున 'రెడ్ అలర్ట్' స్థితి అమల్లో ఉంది. యాత్రికుల భద్రత కోసమే శనివారం శబరిమల యాత్రను రద్దు చేస్తున్నాం."

---దివ్య ఎస్ అయ్యర్, పతనంతిట్ట కలెక్టర్

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (kerala rain update today) జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. శబరిమలకు ఆనుకొని ఉన్న పంబ నదిలో(pampa sagar dam) వరద ఉద్ధృతి దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

కరోనాతో పాటు.. భారీ వర్షాల దృష్ట్యా యాత్రికుల రాకను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.