ETV Bharat / bharat

ఎమ్మెల్యే కారు చోరీ.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని విమర్శలు!

author img

By

Published : Jul 17, 2022, 12:40 PM IST

ఎమ్మెల్యే కారును దొంగిలించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన రాజస్థాన్​లోని జరిగింది. దొంగల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

mla car stolen
ఎమ్మెల్యే కారును దొంగిలించిన దుండగులు

ఎమ్మెల్యే వాహనం దొంగతనానికి గురైంది. ఈ ఘటన రాజస్థాన్​ జైపుర్​లోని వివేక్​ విహార్​లో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన స్కార్పియో కారు యజమాని.. రాష్ట్రీయ లోక్​తాంత్రిక్ పార్టీ ఎమ్మెల్యే నారాయణ్ బెనివాల్​. ఆయన ఖీంవాసర్ నియోజకవర్గం నుంచి 2019 లో ఎన్నికయ్యారు. నారాయణ్ బెనివాల్.. నాగౌర్ ఎంపీ హనుమాల్ బెనివాల్​కు స్వయానా సోదరుడు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్​లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

"వివేక్ విహార్​లోని అపార్ట్​మెంట్​లో శనివారం కారును పార్క్ చేశా. ఉదయం చూసేవారికి వాహనం కనిపించలేదు. దొంగలకు పోలీసులంటే భయం లేదు. ఎమ్మెల్యే వాహనం ఇలా దొంగతనానికి గురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి? సాధారణ ప్రజలను పోలీసులు తనిఖీ చేస్తారు. దొంగలు, నేరస్థులను మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు."

-నారాయణ్ బెనివాల్, ఎమ్మెల్యే

ఇవీ చదవండి: విభజన గాయాలు గుర్తు చేసుకున్న రీనా వర్మ.. 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్​కు..

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.