ETV Bharat / bharat

బాలిక​పై ఆటో డ్రైవర్​ అత్యాచారం.. యూపీలో మరో ఇద్దరు మైనర్లపై..

author img

By

Published : Dec 21, 2021, 10:05 PM IST

Rape Victim News: రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్​. యూపీలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మైనర్లపై అత్యాచారం జరిగింది.

Rape Victim News
యూపీలో మైనర్​పై రేప్

Rape Victim News: రాజస్థాన్​లో ఘోరం జరిగింది. మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఆటో డ్రైవర్​.

ఝాలావాఢ్​ జిల్లాలోని డాడ్​వాడా ప్రాంతంలో బాలిక నివసిస్తోంది. అదే బిల్డింగ్​లో నివసిస్తున్నాడు నిందితుడు. సరకులు కొనడానికి బయటికి వెళ్లినప్పుడు బాలికను అనుసరించాడు ఆ ఆటో డ్రైవర్​. మాయ మాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నాడు. ఓ నిర్మాణ దశలో ఉన్న భవనం దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు.

యూపీలో ఘోరం..

Muzaffarnagar Rape Case: ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్ నగర్​లో మైనర్​పై (15)​ స్థానిక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను ఇంటికి తీసుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

దళిత బాలికపై..

ముజఫర్ నగర్ జిల్లాలో ఛత్రవాల్ ప్రాంతంలో ఓ మైనర్​పై (16)​ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: వివాహేతర సంబంధం వద్దు అన్నందుకు.. మహిళ కొడుకును చంపి..

మహిళపై 'గాడ్‌మ్యాన్' అత్యాచారం.. గర్భవతిని చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.