ETV Bharat / bharat

మహిళా మేజిస్ట్రేట్​పై తహసీల్దార్​ అత్యాచారయత్నం- బీజేపీ ఎమ్మెల్సీ ట్వీట్​తో!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 10:57 PM IST

Rape Attempt On Lady Magistrate : ఓ మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ ఉన్నతాధికారి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని ఓ బీజేపీ నేత ట్విట్టర్​లో పోస్ట్​ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది.

Rape And Murder Attempt On Lady Magistrate In UP Basti District
Rape And Murder Attempt On Lady Magistrate In UP

Rape Attempt On Lady Magistrate : ఉత్తర్​ప్రదేశ్​లోని బస్తీ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ మహిళా మేజిస్ట్రేట్​పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు నాయబ్ తహసీల్దార్​. ఈ విషయాన్ని ఓ బీజేపీ నాయకుడు తన ట్విట్టర్​ ఖాతాలో వివరిస్తూ పోస్ట్​ పెట్టారు. ఈ పోస్ట్​కు ఆయన యూపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీని కూడా ట్యాగ్​ చేయడం వల్ల విషయం బయటకు వచ్చింది.

ఇదీ జరిగింది..
జిల్లాలో నాయబ్​ తహసీల్దార్​గా పని చేస్తున్న ఓ వ్యక్తి దీపావళి రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ మహిళా మేజిస్ట్రేట్​ ఇంటికి వెళ్లాడు. అక్కడకు చేరుకొని ఆమె ఇంటి తలుపులు తట్టాడు. సదరు మహిళ ఎంతకీ తలుపులు తీయకపోవడం వల్ల వాటిని బద్దలుకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. అనంతరం గదిలో ఉన్న ఆ మేజిస్ట్రేట్​పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించడం వల్ల ఆమెను చంపేందుకు కూడా వెనకాడలేదు. గొంతు నులిమి ఆమెను చంపేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నట్లుగానే మహిళ గొంతును తన రెండు చేతులతో నులిమాడు. చివరకు ఆమె చనిపోయిందని భావించి అక్కడ నుంచి పారిపోయేందుకు చూశాడు.

ఈ క్రమంలో చనిపోయిందనుకున్న మహిళ ఒక్కసారిగా లేచి మంచంపై ఉన్న బెడ్​ షీట్​ను కప్పుకొని దాక్కుందామని చూసింది. ఇంతలో ఆ శబ్దం విన్న నిందితుడు మళ్లీ ఆమెను చంపేందుకు తిరిగి వచ్చాడు. ఈ సమయంలో బాధిత మహిళ తీవ్రంగా ప్రతిఘటించి అతడి చెర నుంచి తప్పించుకుంది. అంతేకాకుండా తనపైకి వస్తున్న తహసీల్దార్​ను గదిలోకి నెట్టి బయట నుంచి గడియ పెట్టింది. అనంతరం పోలీస్​ స్టేషన్​కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది.

బీజేపీ నేత ట్వీట్​తో వైద్య పరీక్షలు, కేసు నమోదు!
సదరు నాయబ్ తహసీల్దార్‌పై మహిళ చేస్తున్న ఆరోపణలను పోలీసులు ముందుగా పట్టించుకోలేదు. అయితే ఈ విషయం ఏదో విధంగా బీజేపీ ఎమ్మెల్సీ దేవేంద్ర ప్రతాప్​ సింగ్​ అనే నేత దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తూ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఆ పోస్ట్​కు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీని ట్యాగ్​ చేయడం వల్ల ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన సంబంధిత పోలీసులు బాధిత మహిళా మేజిస్ట్రేట్​ను గురువారం రాత్రి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మహిళా అధికారి ఫిర్యాదు మేరకు నాయబ్ తహసీల్దార్‌పై శుక్రవారం కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

బ్యాంకు ఖాతాలోకి రోజూ రూ,కోటి- ఆరు రోజులు నాన్​స్టాప్​గా డబ్బు జమ- ఏమైంది?

18వారాలకు కవల పిండం మృతి- 125 రోజులకే మరో శిశువుకు జన్మ- వైద్య రంగంలోనే అద్భుతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.