ETV Bharat / bharat

బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారం.. నిందితుల్లో నలుగురు మైనర్లు!

author img

By

Published : Jun 17, 2022, 5:01 PM IST

Updated : Jun 17, 2022, 5:08 PM IST

ఓ మైనర్​పై​ ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇవ్వకపోతే వీడియోను లీక్​ చేస్తామంటూ బెదిరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ఐటీ ఉద్యోగినిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్​రేప్​ చేశారు. మద్యం తాగించి ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డారు.

gangrape
gangrape

రాజస్థాన్​ ధోల్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో నలుగురు మైనర్లు ఉన్నారు. ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది: ప్రధాన నిందితుడు మైనర్​ అయిన తన గర్ల్​ఫ్రెండ్​కు మాయమాటలు చెప్పి అతని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మిగతా నిందితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియో తీసిన నిందితులు.. రూ.లక్ష ఇవ్వకపోతే వీడియోను వైరల్​ చేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్​ తమ దృష్టికి రావడంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్లు ఉన్నట్లు గుర్తించారు.

మైనర్​పై తండ్రీకొడుకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగింది. గర్భవతైన కోడలిని చూసుకునేందుకు బంధువైన ఆ 14 ఏళ్ల బాలికను సుమారు నెల రోజుల క్రితం నిందితులు తమ ఇంటికి తీసుకువచ్చారు. అయితే వివిధ సందర్భాల్లో వీరిద్దరూ అత్యాచారానికి పాల్పడేవారు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఐటీ ఉద్యోగినిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బంగాల్​లోని కోల్​కతాలో జరిగింది. గత శనివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ హోటల్​లో జరిగిన ఆఫీస్​ పార్టీకి హాజరైన బాధితురాలికి మద్యం తాగించిన నిందితులు.. రూంకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : మేనకోడలిపై బిజినెస్​మ్యాన్​ అత్యాచారం.. దావూద్​ గ్యాంగ్‌తో చంపిస్తానంటూ..

Last Updated : Jun 17, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.