ETV Bharat / bharat

'బడ్జెట్​లో పేదలకు శూన్యం.. అంతా ఆ కొందరు సంపన్నుల కోసమే!'

author img

By

Published : Feb 2, 2022, 6:49 PM IST

Priyanka Gandhi News: కేంద్ర బడ్జెట్​లో పేదలు, సామాన్యులకు మేలు చేసేలా ఏమీ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కొందరు వ్యాపారవేత్తల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఈ పద్దు రూపొందించారని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో విమర్శించారు. మరోవైపు.. ఉత్తరాఖండ్​ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన ఆమె.. పోలీసు శాఖలో 40శాతం పోస్టుల్ని మహిళలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

priyanka gandhi
ప్రియాంక గాంధీ

Priyanka Gandhi News: ఉత్తరాఖండ్​ ప్రజలు ఏ పార్టీ ఏం చేసిందో చూసి, అభివృద్ధే ప్రధానాంశంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. దెహ్రాదూన్​ పర్యటనలో ఉన్న ఆమె ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్​లో పేదలు, సామాన్యులకు మేలు చేసేలా ఏమీ లేదని ధ్వజమెత్తారు. కొందరు వ్యాపారవేత్తలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ తెచ్చారని ఆరోపించారు.

ఈటీవీ భారత్​లో మాట్లాడిన ప్రియాంక గాంధీ

మహిళలకు 40శాతం రిజర్వేషన్

అంతకుముందు ఉత్తరాఖండ్​ శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో 'ఉత్తరాఖండ్​ స్వాభిమాన్ ప్రతిజ్ఞా పత్ర'ను విడుదల చేశారు ప్రియాంక. పోలీసు శాఖలో 40శాతం ఉద్యోగాల్ని మహిళలకు రిజర్వ్ చేస్తామని, రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని, ఉత్తరాఖండ్​ కోసం ప్రత్యేకంగా టూరిజం పోలీస్​ ఫోర్స్​ సృష్టిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ 40శాతం పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.500 దాటనివ్వమని వాగ్దానం చేశారు.

"ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదు. అందుకే ప్రజలు ఓటును సీరియస్​గా తీసుకోవాలి. ఎందుకంటే మార్పు తీసుకొచ్చేందుకు అదే శక్తిమంతమైన అస్త్రం. కాంగ్రెస్​ మాత్రమే మార్పు తీసుకురాగలదు. యువత హక్కులు, మీ చిన్నారుల భవిష్యత్​ కోసం పోరాడగలదు. వారు(భాజపా నేతలు) చెబుతున్న డబుల్ ఇంజిన్ పనిచేయడం లేదు. ఎన్నడూ లేని స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణం" అని మేనిఫెస్టో విడుదల సందర్భంగా అన్నారు ప్రియాంక. ఆమె ప్రసంగం 70 నియోజకవర్గాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేలా కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : 'ప్రతి పురుషుడిని రేపిస్ట్ అంటే ఎలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.