ETV Bharat / bharat

Kalyan Singh death: కల్యాణ్​సింగ్ భౌతికకాయానికి మోదీ నివాళి

author img

By

Published : Aug 22, 2021, 12:07 PM IST

Updated : Aug 22, 2021, 2:18 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​ సింగ్ భౌతికకాయానికి(Kalyan Singh death) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయం ముందు పుష్ఫగుచ్ఛం ఉంచి నమస్కరించారు.

pm tributes kalyansingh
మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​సింగ్ (Kalyan Singh death) నివాసానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi). కల్యాణ్​సింగ్ భౌతికకాయం ముందు పుష్పగుచ్ఛం ఉంది నివాళులు అర్పించారు. జన​కల్యాణమే మంత్రంగా కల్యాణ్ ముందుకెళ్లారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. యూపీ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని ప్రశంసించారు. సరైన పాలన, నిజాయతీకి నిదర్శనం కల్యాణ్ సింగ్​ అన్నారు మోదీ.

pm tributes kalyansingh
కల్యాణ్​సింగ్ భౌతికకాయానికి ప్రధాని నివాళులు

విలువైన నాయకుడు..

ఉత్తర్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్​సింగ్ విలువైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. ఆయన 'నమ్మకానికి గుర్తు' అంటూ అభివర్ణించారు. కల్యాణ్​సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత మోదీ మీడియాతో మాట్లాడారు.

" దేశం ఓ విలువైన, సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయింది. ఆయన ఆశయాలను, కలలను నెరవేర్చేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. తనమొత్తం జీవితాన్ని దేశప్రజలకు అంకితం చేశారు. కల్యాణ్​ సింగ్.. జన కల్యాణమే మంత్రంగా పనిచేశారు. తన జీవితకాలం మొత్తం భాజపా, భారతీయ జన్​సంఘ్​ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ప్రజాసంక్షేమం కోసం కల్యాణ్​సింగ్ పనిచేశారు. ఆ శ్రీరాముడు.. కల్యాణ్​ సింగ్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను.''

-- నరేంద్ర మోదీ, ప్రధాని

అంతకుముందు లఖ్​నవూ విమానాశ్రయంలో దిగిన మోదీకి.. గవర్నర్ ఆనందీబెన్ పాటిల్​, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్​, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతం పలికారు.

pm tributes kalyansingh
కల్యాణ్​సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
pm tributes kalyansingh
కల్యాణ్​సింగ్ భౌతికకాయానికి నమస్కరిస్తున్న మోదీ

ఉత్తర్​ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతి పట్ల.. అంతకుముందు ప్రధాని ట్వీట్ చేశారు.

"కల్యాణ్ సింగ్ రాజనీతిజ్ఞుడు, మానవతా విలువలున్న వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగారు. ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధిలో కల్యాణ్ సింగ్ పాత్ర ఎనలేనిది."

--నరేంద్ర మోదీ, ప్రధాని

కల్యాణ్​ సింగ్ దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని అన్నారు.

ఇదీ చదవండి: 'రాజనీతిజ్ఞుడు.. మానవతా విలువలున్న వ్యక్తి కల్యాణ్ సింగ్'

Last Updated : Aug 22, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.