ETV Bharat / bharat

ఫిన్​లాండ్​ ప్రధానితో మోదీ వర్చువల్ సమావేశం

author img

By

Published : Mar 16, 2021, 5:51 AM IST

Updated : Mar 16, 2021, 6:08 AM IST

ఫిన్​లాండ్​ ప్రధాని సన్నా మారిన్​తో మంగళవారం భేటీ కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వర్చువల్​ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించే అవకాశముంది.

PM Modi to hold virtual summit with Finnish counterpart Marin on Tuesday
ఫిన్​లాండ్​ ప్రధానితో మోదీ వర్చవల్ సమావేశం

ఫిన్​లాండ్​ ప్రధాని సన్నా మారిన్​తో మంగళవారం వర్చువల్​గా సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరుదేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రాంతీయ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సవాళ్లపైనా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది.

ప్రస్తుతం భారత్​లో దాదాపు 100కు పైగా ఫిన్​లాండ్​కు చెందిన కంపెనీలు ఉన్నాయి. భారత్​కు చెందిన దాదాపు 30 కంపెనీలు ఫిన్​లాండ్​లో ఉన్నాయి. ఇరు దేశాలు సంయుక్తంగా.. కృత్రిమ మేధను ఉపయోగించి 'క్వాంటమ్ కంప్యూటర్​'ను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇదీ చదవండి : మయన్మార్​లో మార్షల్​ చట్టం- నిరసనలపై ఉక్కుపాదం

Last Updated : Mar 16, 2021, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.