ETV Bharat / bharat

విమానం తయారు చేసిన ఆటోడ్రైవర్ కొడుకు!

author img

By

Published : Aug 23, 2021, 8:05 AM IST

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు విమానం తయారు చేశాడంటే నమ్మగలరా? కానీ ఒక్క విమానమేమిటి? బోట్లు, మోటారు సైకిళ్లు, జేసీబీలు, రోబోలు, సైకిళ్లను తయారు చేశాడు 14 ఏళ్ల ఆదిత్య. అతనో ఆటో డ్రైవర్​ కుమారుడు.

odisha airplane boy
ఒడిశా

విమానం తయారు చేసిన 14ఏళ్ల బాలుడు

ప్రతిభకు.. నేపథ్యంతో పనిలేదు. సృజనకు వసతులలేమి అడ్డుకాదు. అద్భుత ఆవిష్కరణలకు ప్రాణం పోసే నైపుణ్యానికి.. జిజ్ఞాస ఒక్కటి చాలని నిరూపిస్తున్నాడు 14 ఏళ్ల బాలుడు. అతడే.. ఒడిశా కటక్​కు చెందిన ఆదిత్య మహారాణా.

తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు.. విమానం తయారు చేశాడంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ, మహానది నదిపై ఆదిత్య తయారు చేసిన విమానం గాల్లోకి ఎగిరాక.. అది నిజమైనదనే భావన కలగకమానదు. ఈ ఆవిష్కరణతో అతడు ఎయిర్​ప్లేన్​ బాయ్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఒక్క విమానమేనా....? బోట్లు.. మోటారు సైకిళ్లు... జేసీబీ యంత్రాలు, రోబోలు, సైకిళ్లను తయారు చేశాడు ఆదిత్య. వాటిల్లో బ్యాటరీలు, రీమోట్లు, ఈఎస్​ కంట్రోలర్​, మోటార్లను అమర్చి పరిగెత్తిస్తున్నాడు. విమానంతో పాటు బోట్లను రిమోట్ కంట్రోల్​తో నియంత్రించడం చూస్తుంటే... ఆదిత్య.... మినీ సైంటిస్ట్​లా కనబడతాడు.

odisha airplane boy
ఆదిత్య తయారు చేసిన బోటు

యూట్యూబ్​లో చూసి..

అయితే ఇదంతా చేసింది ఏ ప్రయోగశాలలోనో కాదు. చిన్న గది​లో. బట్టలు, బీరువాలు ఉన్న గదిని.. ఎయిర్​బేస్​లా మార్చేశాడు ఆదిత్య. ఈ ఆవిష్కరణలన్నింటినీ అతడు యూట్యూబ్​లోనే చూసి నేర్చుకోవడం విశేషం.

వెనక్కు లాగుతున్న పేదరికం..

ఇంతటి ప్రతిభను అప్పుడప్పుడూ తన పేదరికం వెనక్కులాగుతూనే ఉంటుంది. ఆటో డ్రైవర్​ అయిన తండ్రి.. ఆదిత్య సామర్థ్యాన్ని చిన్నప్పుడే గుర్తించారు. స్తోమత మేరకు ప్రోత్సాహిస్తూ వచ్చారు. కానీ, ఆయన సంపాదన కుటుంబ పోషణకు, ఆవిష్కరణలకు అవసమయ్యే సామగ్రిని తెచ్చిపెట్టడానికి సరిపడదు. మరిన్ని ఆవిష్కరణలకు చేయడానికి పేదరికం అడ్డురాకూడదు కదా? అందుకే.. ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థల సహకారం కోరుతున్నారు. అవి ప్రోత్సాహం అందిస్తే.. తన కొడుకు ఏదైనా గొప్పగా సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ నుంచి పెట్రోల్, గ్యాస్- 12ఏళ్లకు ఫలించిన ప్రయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.