ETV Bharat / bharat

భూ వివాదంలో చిక్కుకున్న శివపార్వతులు.. నోటీసులు జారీ!

author img

By

Published : Nov 5, 2022, 12:50 PM IST

శివపార్వతులు ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. శివపార్వతుల పేరు మీదున్న భూమిని తమ పేరు మీదకు మార్చాలని ఓ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

lord shiva and parvati in land dispute
lord shiva and parvati in land dispute

ఛత్తీస్​గఢ్​లో వింత సంఘటన జరిగింది. శివపార్వతుల పేరు మీదున్న భూమిని తమ పేరు మీదకు ట్రాన్స్​ఫర్​ చేయాలని యమునా దేని అనే మహిళ, ఆమె కుటుంబ సభ్యులు కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అయితే అది దానంగా ఇచ్చిన భూమి అని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిందంటే.. ఛత్తీస్​గఢ్​ భన్​పురి అనే గ్రామంలో 25 ఎకరాల వివాదాస్పద భూమి 1939 వరకు పితాంబర్​ అనే వ్యక్తి పేరు మీద ఉండేది. ఆ తర్వాత 1954 నుంచి గ్రామానికి చెందిన శిల్పి హించరన్ సిన్హా, శివుడు, పార్వతి పేరు మీద ఉంది. అయితే హించరన్​ సిన్హాకు చెందిన కుటుంబ సభ్యులు.. ఆ భూమి తమ పూర్వీకులదే అని క్లెయిమ్ చేశారు. దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్​ కూడా వేశారు. అయితే దేవుడు ఎప్పుడూ సజీవంగానే ఉంటాడని.. దేవుడికి నోటీసులు జారీ చేయడం కుదరదని కోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్​పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాల్సిందిగా సాధారణ నోటీసుల్ని కోర్టు జారీ చేసింది.

గ్రామస్థుల అభ్యంతరం..
కోర్టు నోటీసులు జారీ చేయడం వల్ల గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపై యమునా దేవి కుటంబ సభ్యులు చేసిన ఆరోపణలను ఖండించారు. కలెక్టర్​ ఆఫీసుకు వచ్చి.. 80 ఏళ్ల నాటి రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. 1941 నుంచి 1955 వరకు బదిలీ డొనేషన్ రిజిష్టర్ రికార్డులు, మ్యాపులు, బి-1, పత్రాలు అందించాలని కోరారు. అయితే యమునా దేవి పూర్వీకులు శివపార్వతి పేరిట భూమిని దానం చేశారని.. ఇంతకాలం వారు ఆ భూమిని వాడుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ భూమిని గ్రామ కమిటీకే ఇవ్వాలని కోరారు. ఈ భూమి శివపార్వతులకే చెందుతుందని.. వారికి అక్కడ గుడి కట్టిస్తామని వెల్లడించారు.

దేవుడికి నోటీసులివ్వలేం..
అయితే చరమా తహసీల్దార్ హెచ్‌ఆర్‌ నాయక్‌ మాట్లాడుతూ.. "దేవుడిని ఎప్పుడూ సజీవంగానే భావిస్తారు. ఆయనకు నోటీసులివ్వలేము. కాబట్టి సాధారణ క్లెయిమ్ అభ్యంతరాల నోటీసు జారీ చేశాము. కొందరు గ్రామస్థులు ఈ భూ వివాదంలో తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. వారి వాంగ్మూలాలు రికార్డు చేస్తున్నాం" అని చెప్పారు.

ఇవీ చదవండి : మల్లయోధుడిని ఓడించిన మహిళా రెజ్లర్​

అన్నదమ్ములను తొక్కి చంపిన ఏనుగు.. కాపాడబోయిన తల్లిదండ్రులకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.