ETV Bharat / bharat

'రాహుల్​ గాంధీని బ్రిటన్​ కోర్టుకు లాగుతా'.. లలిత్ మోదీ తీవ్ర విమర్శలు

author img

By

Published : Mar 30, 2023, 1:05 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోర్టుకు లాగుతానన్నారు ఐపీఎల్​ ఫౌండర్​ లలిత్ మోదీ. 'బ్యాగ్​ మెన్​', చట్టం నుంచి తప్పంచుకు తిరిగుతున్నారంటూ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్​ కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.

lalit modi on rahul gandhi
lalit modi on rahul gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు ఐపీఎల్​ ఫౌండర్​ లలిత్ మోదీ. గురువారం వరుస ట్వీట్లతో రాహుల్, ఆయన అనుచరుపై విరుచుకుపడ్డారు. 'బ్యాగ్​ మెన్​', చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారంటూ రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్​ కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. దేశంలో ప్రతిపక్ష నేతలు సరైన అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

"రాహుల్ సహా ఆయన అనుచరులు అనేక మంది నేను చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని అంటున్నారు. ఎందుకు అలా పిలుస్తున్నారు? ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషినని తీర్పు వచ్చిందా? పప్పు అలియాస్​ రాహుల్ గాంధీలా కాకుండా.. నేను ఓ సాధారణ పౌరుడిని. ప్రతిపక్ష నాయకులు ఏ సమాచారం లేకుండా కక్ష సాధించేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నాను. ఆయన స్పష్టమైన ఆధారాలతో కోర్టు ముందుకు రావాల్సి ఉంటుంది. ఆయన తనను తాను పరిపూర్ణ మూర్ఖుడిగా మారడాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. గాంధీ కుటుంబం తరఫున సంచులు మోసే ఆర్‌కే ధావన్, మోతీలాల్ వోరా, సీతారామ్ కేసరి, నారాయణ్ దత్ తివారీ, సతీశ్ శర్మ వంటివారికి విదేశాల్లో ఆస్తులు ఎలా వచ్చాయో.. కమల్‌నాథ్‌ను అడగండి."

-- లలిత్ మోదీ, ఐపీఎల్ ఫౌండర్​

"నిజమైన అవినీతిపరుల చిరునామాలు, ఫొటోలను పంపిస్తాను. మనం భారతీయులను వెర్రివాళ్లను చేయవద్దు. దేశాన్ని పరిపాలించే అర్హత తమకు మాత్రమే ఉందన్నట్లుగా గాంధీ కుటుంబం చేస్తోంది. మీరు కఠినమైన చట్టాలను చేసినపుడు నేను కచ్చితంగా భారత్​కు తిరిగి వస్తాను. జై హింద్" అని మరొక ట్వీట్‌లో లలిత్ మోదీ పేర్కొన్నారు.

"నేను డబ్బులు తీసుకున్నట్లు గడిచిన 15 ఏళ్లలో రుజువు కాలేదు. కానీ ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన స్పోర్ట్​ ఈవెంట్‌ను సృష్టించాను. దీని వల్ల దాదాపు 100 బిలియన్ డాలర్ల సంపద వచ్చింది. 1950వ దశకం నుంచి మోదీ కుటుంబం కాంగ్రెస్‌, దేశం కోసం ఎంతో చేసింది. వారి ఊహకు కూడా అందనంత ఎక్కువ చేసిందని కాంగ్రెస్ నేత మర్చిపోకూడదు. నేను సైతం ఊహించనంత ఎక్కువే చేశాను. కుంభకోణాలలో చిక్కుకున్న గాంధీ కుటుంబ అనుచరులు మొరుగుతూనే ఉండండి." అని మూడో ట్వీట్‌లో లలిత్ మోదీ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీపై లోక్​సభ సభ్యత్వంపై ఇటీవలే అనర్హత వేటు పడింది. కర్ణాటక కొలార్​లో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ గుజరాత్​లోని సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశారు. దీంతో ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆధారంగా చేసుకుని లోక్​సభ సచివాలయం రాహుల్​పై అనర్హత వేటు వేసింది.

ఇవీ చదవండి : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాపై నిషేధం.. రేడియో హ్యాండిల్​పైనా..

చనిపోయిన రైతుకు లోన్​.. డబ్బులివ్వకుండానే రుణం కట్టాలంటూ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.