ETV Bharat / bharat

రాష్ట్ర మంత్రిపై గవర్నర్ కొరడా.. కేబినెట్ నుంచి తప్పించాలని సీఎంకు లేఖ

author img

By

Published : Oct 26, 2022, 2:29 PM IST

కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య నెలకొన్న వివాదం మరో అనూహ్య మలుపు తిరిగింది. ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్​పై తాను విశ్వాసం కోల్పోయినట్లు ప్రకటించారు గవర్నర్. ఫలితంగా.. మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించాలని సంకేతాలిచ్చారు.

kerala governor issue
కేరళ రాజకీయంలో భారీ ట్విస్ట్

రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కోరుతూ కేరళ గవర్నర్ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్​కు స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి కేఎన్​ బాలగోపాల్​పై తాను విశ్వాసం కోల్పోయినట్లు పినరయి విజయన్​కు రాసిన లేఖలో పేర్కొన్నారు గవర్నర్. అక్టోబర్ 19న తిరువనంతపురంలోని ఓ యూనివర్సిటీ క్యాంపస్​లో బాలగోపాల్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల, బాలగోపాల్​పై విశ్వాసం కోల్పోయానని ప్రకటించడం మినహా తనకు వేరే అవకాశం లేకుండా పోయిందని గవర్నర్ తన లేఖలో వ్యాఖ్యానించారు.

కేరళలోని విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య కొంతకాలంగా వేర్వేరు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్​ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్​కు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. మరోవైపు.. గవర్నర్​ ఆదేశాల్ని సవాలు చేస్తూ వీసీలు న్యాయపోరాటం మొదలుపెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.