ETV Bharat / bharat

కేరళలో దంచికొడుతున్న వర్షాలు.. ఆరుగురు మృతి

author img

By

Published : Oct 16, 2021, 3:02 PM IST

Updated : Oct 16, 2021, 9:19 PM IST

కేరళను భారీ వరదలు ముంచెత్తాయి(kerala floods today). ఎడతెరపి లేని వానకు రహదారులు చెరువులుగా మారగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొట్టాయం జిల్లా కూట్టిక్కల్​లో కొండచరియలు విరిగిపడగా.. నలుగురు చనిపోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Kerala rains
కేరళ వర్షాలు

కేరళలో భారీ వర్షాలు

కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగాయి. కూట్టిక్కల్​లో కొండచరియలు విరిగిపడగా.. నలుగురు చనిపోయారు. మరో 9 మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆరుగురు బలయ్యారు. పలువురి ఆచూకీ గల్లంతైంది. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. తిరువనంతపురంలో పలు రహదారులు జలమయం కాగా.. ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల తెన్‌మల డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేయగా.. సమీపంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Kerala rains
గ్రామస్థుల ఇబ్బందులు
Kerala rains
నీటమునిగిన అరటితోట

అటు పథనంతిట్ట జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉండగా ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ అక్కడి పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు జిల్లాలోని అనతోడు, కక్కి డ్యాంల నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుండటం వల్ల అధికారులు గేట్లు ఎత్తివేశారు. డ్యాం పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అలప్పుజా, ఇడుక్కి, కుట్టనాడ్‌లనూ భారీ వర్షాలు కుదిపేయగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయంగా మారాయి.

Kerala rains
వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు

ఇవీ చదవండి:

Last Updated : Oct 16, 2021, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.