బాలుడి అద్భుత బ్యాటింగ్​కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఫిదా

author img

By

Published : May 14, 2021, 3:41 PM IST

Updated : May 14, 2021, 10:04 PM IST

Kerala boy, Vighnaj

ఓ బాలుడు ఆడుతున్న క్రికెట్​ షాట్లకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​ ఫిదా అయింది. తొమ్మిదేళ్ల ఆ అబ్బాయి నెట్​లో బ్యాట్​తో కాకుండా వికెట్​తో​ అద్భుతంగా సాధన చేసిన దృశ్యాలను చూసి.. అతడికి క్రికెట్​ కెరీర్​కు మద్దతిస్తామని తెలిపింది. ఇంతకీ.. ఫ్రాంఛైజీ మెచ్చిన ఆ బాలుడెవరు? తెలుసుకుందాం..

ఆ బాలుడి 'వికెట్​​ బ్యాటింగ్​'కు రాజస్థాన్​ రాయల్స్​ ఫిదా!

కేరళకు చెందిన తొమ్మిదేళ్ల విఘ్నాజ్ క్రికెట్​లో అద్భుతమైన​ షాట్లతో అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. బ్యాట్​తోనే కాదు, వికెట్తో​నూ బంతిని గురిచూసి బాదుతూ ఔరా అనిపిస్తున్నాడు. వికెట్ చేత్తో పట్టుకుని ప్లాస్టిక్​ బాల్​తో అతడు సాధన చేసిన దృశ్యాలను.. తండ్రి ప్రజిత్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. ఈ వీడియో చూసి.. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​ ఫిదా అయింది. విఘ్నాజ్​ బ్యాటింగ్​ శైలి, నైపుణ్యం పరిశీలించి.. అతడి ప్రతిభకు మరింత మెరుగులు దిద్ది.. అతడి ఉన్నత కెరీర్​కు తమవంతు సహకారమందిస్తామంది.

ఇదీ చదవండి: ప్రోగ్రామింగ్​ను ఆటాడుకుంటున్న ఏడేళ్ల బుడతడు!

బ్యాట్​ విరిగినా.. ప్రాక్టీస్​ ఆపలేదు..

త్రిస్సూర్​ జిల్లాకు చెందిన విఘ్నాజ్​ క్రికెట్​పై తనకున్న మక్కువతో లూంగ్స్​ క్రికెట్​ అకాడమీలో చేరాడు. రోజూ సుమారు 5గంటల పాటు అక్కడ సాధన చేసేవాడు. కరోనా లాక్​డౌన్ కారణంగా అకాడమీ మూతపడటం వల్ల.. వాళ్ల ఇంటి​ పైనే సాధన చేయడం ప్రారంభించాడు. అలా ప్రాక్టీస్​ చేసే సమయంలో అతడి వద్దనున్న ఒక్కగానొక్క బ్యాట్​ విరిగింది. స్పోర్ట్​ షాపులు మూసి ఉన్నందున బ్యాట్​ కొనలేకపోయాడు. అలా అని అతడు సాధన మాత్రం ఆపలేదు. బ్యాట్​కు బదులుగా వికెట్​​ను ఉపయోగిస్తూ ప్రాక్టీస్​ చేయడం కొనసాగించాడు.

ఇదీ చదవండి: అసాధారణ ప్రతిభతో నాలుగేళ్లకే 'గూగుల్​ గర్ల్'​!

53 లక్షల వీక్షణలు..

ఆడేది వికెట్​​తో అయినా.. అచ్చమైన క్రికెటింగ్​ షాట్లతో ఆకట్టుకున్నాడు విఘ్నాజ్​. ఈ దృశ్యాలను ఆ బాలుడి తండ్రి రికార్డ్​ చేసి.. సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్​ అయింది. సుమారు 53 లక్షలకుపైగా వీక్షణలు పొందింది. వికెట్​​తోనూ విఘ్నాజ్​ అంత అద్భుతంగా ఆడుతున్న తీరును చూసి పలువురు మెచ్చుకుంటున్నారు.

'సిడ్నీ సిక్సర్స్​​​' కోచ్​ ప్రశంసలు..

ఆస్ట్రేలియన్​ క్లబ్​ సిడ్నీ సిక్సర్స్​ కోచ్​ షెపర్డ్​.. విఘ్నాజ్​ వీడియోను చూసి.. అతడిలోని నైపుణ్యాన్ని ప్రశంసించారు. అలా ఆ బాలుడి ఘనత విదేశాలకూ పాకింది.

విఘ్నాజ్​ తండ్రి ఓ నిర్మాణ కంపెనీలో జనరల్​ మేనేజర్​ కాగా.. తల్లి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన వికెట్​ బ్యాటింగ్​ షాట్లతో క్రికెట్​ ప్రేమికుల్ని అలరిస్తున్న విఘ్నాజ్​.. టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​ శర్మను అమితంగా అభిమానిస్తాడు.

ఇదీ చదవండి: రెండేళ్లకే అంకెలతో ఆడేసుకుంటున్న బుడతడు

Last Updated :May 14, 2021, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.