ETV Bharat / bharat

'తప్పుడు ప్రచారంతో దేశ ప్రజల్ని రక్షించలేరు'

author img

By

Published : Oct 27, 2021, 12:37 PM IST

మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ (Rahul gandhi news). వ్యాక్సినేషన్​పై అసత్యాలు చెప్పి.. ప్రజల జీవితాల్ని రక్షించలేరని అన్నారు. దేశంలో ఇంకా చాలా మందికి టీకా అసలే అందలేదని ఆరోపించారు.

'Jumla' version of COVID-19 vaccine story will not save lives: Rahul Gandhi
'తప్పుడు ప్రచారం చేసి.. దేశ ప్రజల్ని రక్షించలేరు'

వ్యాక్సినేషన్​పై (Vaccination in India) కేంద్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ(Rahul gandhi news). ఇలా తప్పుడు ప్రచారాలు చేసి, అసత్యాలు చెప్పి ప్రజల్ని కాపాడలేరని విమర్శించారు. DutyToVaccinate అనే హ్యాష్​ట్యాగ్​ను జోడించారు.

కాంగ్రెస్​ అధినేత్రి (Congress news today) సోనియా గాంధీ ఓ వార్తాపత్రికకు రాసిన కథనాన్ని ట్విట్టర్​లో షేర్​ చేసి.. రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో 100 కోట్ల టీకా డోసుల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో.. సోనియా అభిప్రాయం ఆ కథనంలో ఉంది. భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఆ సందర్భంగా అభినందించిన ఆమె.. పిల్లలు సహా దేశంలో ఇంకా చాలా మంది కొవిడ్​ టీకా వేసుకోలేదని తెలిపారు.

'భారత్​లో ఇంకా 68 కోట్ల మందికిపైగా అసలు వ్యాక్సిన్​ తీసుకోలేదని, ఒక్క డోసు కూడా పొందలేదని' ఉన్న ఓ వెబ్​సైట్​ గణాంకాల్ని కూడా.. రాహుల్​ గాంధీ(Rahul gandhi news) ట్విట్టర్​లో షేర్​ చేశారు.

సోనియా కథనాన్ని ట్విట్టర్​లో షేర్​ చేసిన కాంగ్రెస్(Congress news today) ​.. సార్వత్రిక ఉచిత టీకా విధానానికి భాజపా ప్రభుత్వం దూరంగా ఉందని ఆరోపించింది.

''టీకాలు ఉచితమని ప్రధాని ప్రతిసారీ నొక్కిచెబుతున్నారు. కానీ.. ఇది ఎల్లప్పుడూ ఉచితం అని వారు మర్చిపోతున్నారు.''

- కాంగ్రెస్​ పార్టీ

అందరికీ టీకాలు వేసి కొవిడ్​ను (Vaccination in India) తరిమికొట్టగలిగితే.. మన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించవచ్చని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.

ఇదీ చూడండి: పేదరికంలోకి జారుతున్న మధ్యతరగతి!

కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నా: అమరీందర్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.