ETV Bharat / bharat

బ్యాంక్ జాబ్స్​కు నోటిఫికేషన్.. 200కు పైగా ఖాళీలు.. రూ.76వేల వేతనం!

author img

By

Published : Feb 7, 2023, 12:43 PM IST

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్​ఓ) రిక్రూట్‌మెంట్ కోసం చూస్తున్న అభ్యర్థులు శుభవార్త. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్​ జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం.

indian bank so recruitment 2023
ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ 203 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్‌మెంట్ 2023 షార్ట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి4న విడుదల చేసింది. స్కేల్ I, II, III & IVలో 203 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ త్వరలో అభ్యర్థులకు అందుబాటులో ఉంటుంది. నోటిఫికేషన్​లో ఏఏ పోస్టులు ఉన్నాయి? దరఖాస్తు రుసుము ఎంత? సహా వేతనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నోటిఫికేషన్ వివరాలు..

పోస్ట్ పేరు

స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)

నోటిపికేషన్ తేదీ2023, ఫిబ్రవరి4
ఖాళీల సంఖ్య203
స్థలంభారతదేశం అంతటా
దరఖాస్తు ప్రారంభతేదీత్వరలో ప్రకటిస్తారు.
దరఖాస్తు చివరి తేదీత్వరలో ప్రకటిస్తారు.

ఖాళీ వివరాలు:
ఇండియన్ బ్యాంక్​లో 203 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ బ్యాంకు. దిగువ పట్టికలో పోస్ట్ పేరు, స్కేల్ & ఖాళీల సంఖ్య ఉన్నాయి.

స్పెషలైజేషన్ స్కేల్ 1స్కేల్ 2స్కేల్ 3స్కేల్ 4మొత్తం
ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్) -5302560
రిస్క్ ఆఫీసర్-55515
IT/కంప్యూటర్ ఆఫీసర్-581023
సమాచార భద్రత --527
మార్కెటింగ్ ఆఫీసర్-10-313
ట్రెజరీ ఆఫీసర్-105520
ఫారెక్స్ ఆఫీసర్-46-10
పరిశ్రమల అభివృద్ధి అధికారి5050
HR అధికారులు-32-5
మొత్తం 50426150203

పే స్కేల్:
ఇండియన్ బ్యాంక్ SO (స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం షెడ్యూల్ చేసిన విధంగా జీతం లభిస్తుంది. డియర్‌నెస్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. నెలకు అందే వేతనం వివరాలు ఇలా..

  • స్కేల్ I: రూ.36,000
  • స్కేల్ II: రూ.48,170
  • స్కేల్ III: రూ.63,840
  • స్కేల్ IV: రూ.76,010

వయోపరిమితి (01/01/2023 నాటికి):
పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తగిన అర్హత, వయోపరిమితిని తప్పనిసరిగా కలిగి ఉండాలి. త్వరలో అర్హత, వయోపరిమితి వివరాలు వెబ్​సైట్​లో పొందుపరుస్తారు. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.

వయసు సడలింపు:

SC/ST5 సంవత్సరాలు
ఇతర వెనుకబడిన తరగతులు (OBC నాన్-క్రీమీ లేయర్)3 సంవత్సరాలు
వికలాంగులు 10 సంవత్సరాలు
మాజీ సైనికులు (ఆర్మీ సిబ్బంది) 5 సంవత్సరాలు
వితంతువులు/విడాకులు తీసుకున్న మహిళలు9 సంవత్సరాలు
1-1-1980 నుంచి 31-12-1989 మధ్య జమ్ము కశ్మీర్​లో నివాసం ఉన్న వ్యక్తులు5 సంవత్సరాలు
1984 అల్లర్ల వల్ల ప్రభావితమైన వ్యక్తులు5 సంవత్సరాలు
భోపాల్​లో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి తొలిగిన వ్యక్తులు (మధ్యప్రదేశ్​కు మాత్రమే)5 సంవత్సరాలు

అర్హతలు:
విద్యార్హతలు, కావాల్సిన అనుభవం గురించిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు బ్యాంకు తెలిపింది.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసుము:
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. ఒకసారి చెల్లించిన రుసుము/ఇంటిమేషన్ ఛార్జీలు తిరిగి ఇవ్వరు.

  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ: రూ.175+ GST (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే)
  • రిజర్వేషన్ లేనివారు/ఓబీసీ/ఇతరులు: రూ.850+ GST

వెబ్‌సైట్
అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ వెబ్‌సైట్ www.indianbank.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.