ETV Bharat / bharat

Coast Guard Jobs : కోస్ట్​ గార్డ్​లో జాబ్స్​.. 25వేల శాలరీ.. అప్లై చేసుకోండిలా!

author img

By

Published : Jul 20, 2023, 12:23 PM IST

Indian Coast Guard Jobs : ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారా?.. కేవలం పది, ఇంటర్​ చదివి కొంత పని అనుభవం ఉంటే చాలు ఇండియన్​ కోస్ట్ గార్డులో ఉద్యోగం సంపాదించొచ్చు. మరి పోస్టులెన్నీ? జీతం ఎంత? ఎవరు అర్హులు? జాబ్​ లొకేషన్​ ఎక్కడ? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

Indian Coast Guard Jobs 2023
ఇండియన్​ కోస్ట్​ గార్డ్​లో జాబ్స్​.. గౌరవ వేతనం.. ఇంకెందుకు ఆలస్యం..?

Indian Coast Guard Jobs 2023 : కోస్ట్​ గార్డ్​లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఓ తీపి కబురు చెప్పింది ఇండియన్​ కోస్ట్​ గార్డ్​. కేవలం పది, ఇంటర్మీడియేట్​ పాసై సంబంధిత విభాగంలో కాస్త పని అనుభవం ఉంటే చాలు చక్కని గౌరవ వేతనంతో కూడిన 10 గ్రూప్​ సీ పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 29 వరకు ఆన్​లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

HQ Coast Guard Recruitment : ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ రిక్రూట్​మెంట్​లో భాగంగా ఈ కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

  • స్టోర్​ కీపర్​-II- 1
  • ఇంజిన్​ డ్రైవర్​- 1
  • సివిలియన్​ మోటార్​ డ్రైవర్​ (ఆర్డినరీ గ్రేడ్​)- 2
  • ఫోర్క్​ లిఫ్ట్​ ఆపరేటర్​- 1
  • షీట్​ మెటల్​ వర్కర్​ (స్కిల్డ్​)- 1
  • కార్పెంటర్​ (స్కిల్డ్​)- 1
  • అన్​స్కిల్డ్​ లేబరర్​- 1
  • మోటార్​ ఫిట్టర్​- 2

ఈ పోస్టుకు ఈ అర్హత..

  • స్టోర్​ కీపర్​-II- 12వ తరగతి(ఇంటర్​) పాసై ఉండాలి. దీంతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థలు, పబ్లిక్​ సెక్టార్​ అండర్​టేకింగ్స్ లేదా ఏదైనా గుర్తింపు పొందిన కంపెనీ​లో ఒక సంవత్సరం పాటు స్టోర్​ కీపర్​గా పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
  • ఇంజిన్​ డ్రైవర్​- పదో తరగతి పాసై ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా సంస్థలో ఇంజిన్​ డ్రైవర్​గా పని చేసిన అనుభవం ఉండాలి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి విద్యార్హతలు ఏంటి అనే వివరాల కోసం ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ అధికారిక వెబ్​సైట్​ను వీక్షించొచ్చు.

ఈ వయసు వారు అర్హులు..

  • స్టోర్​ కీపర్​-II- 18-25 సంవత్సరాలు
  • ఇంజీన్​ డ్రైవర్- 18-30 సంవత్సరాలు
  • సివిలియన్​ ఎంటీ​ డ్రైవర్​- 18-27
  • ఫోర్క్​ లిఫ్ట్​ ఆపరేటర్​- 18-27
  • షీట్​ మెటల్​ వర్కర్​- 18-27
  • కార్పెంటర్​- 18-27
  • అన్​స్కిల్డ్​ లేబరర్​- 18-27
  • మోటార్​ ఫిట్టర్​- 18-27

ఇక వివిధ కేటగిరీలకి సంబంధించి వయోపరిమితి మినహాయింపుల కోసం అఫీషియల్​ వెబ్​సైట్​ను చూడొచ్చు.

అప్లై చేసుకొండిలా..
HQ Coast Guard Application : ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పైన తెలిపిన పోస్టులకు అప్లై చేసుకోవడానికి www.indiancoastguard.gov.in వెబ్​సైట్​లో నిర్ణీత అప్లికేషన్ ఫారమ్​ను అందుబాటులో ఉంచారు. దాని ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం ఎంత?
Indian Coast Guard Job Salary : అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టు ఆధారంగా జీతభత్యాలు ఉంటాయి. సాధారణంగా ఈ రకమైన పోస్టులకు నెలకు రూ.18000-25000 వరకు వేతనాలు ఉంటాయి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 2023, ఆగస్టు 29

జాబ్​ లొకేషన్​..
Indian Coast Guard NE Region : కోస్ట్​ గార్డ్​ రీజియన్​(నార్త్​ ఈస్ట్​), కోల్​కతాలోని హెడ్​క్వార్టర్స్​ పరిధిలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.