ETV Bharat / bharat

chinese apps ban: 54 చైనా యాప్​లపై నిషేధం!

author img

By

Published : Feb 14, 2022, 10:54 AM IST

Updated : Feb 14, 2022, 12:03 PM IST

India to ban 54 more Chinese apps: దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 54 యాప్​లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 59 యాప్​లపై నిషేధం విధించిన భారత్​ మరోసారి చైనాకు షాక్​ ఇవ్వనుంది.

54 more Chinese apps citing security threat
54 చైనా యాప్​లపై యాప్​లపై నిషేధం !

India to ban 54 more Chinese apps: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, ఈక్వలైజర్ అండ్‌ బాస్ బూస్టర్, వివా వీడియో ఎడిటర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేష్ లైట్ వంటివి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నిషేధించనున్న ప్రముఖ యాప్​లు ఇవే..!

  • స్వీట్ సెల్ఫీ హెచ్​డీ
  • బ్యూటీ కెమెరా
  • సెల్ఫీ కెమెరా
  • ఈక్వలైజర్ అండ్​ బాస్ బూస్టర్
  • క్యామ్​కార్డ్​ ఫర్​ సేర్స్​ఫోర్స్​ ఈఎన్​టీ
  • ఐలాండ్ 2
  • యాషెస్ ఆఫ్ టైమ్ లైట్
  • వివా వీడియో ఎడిటర్
  • టెన్సెంట్ ఎక్స్‌రివర్
  • ఆన్‌మియోజీ చెస్
  • ఆన్‌మియోజీ అరేనా
  • యాప్‌లాక్
  • డ్యూయల్ స్పేస్ లైట్

గతేడాది జూన్‌లో టిక్‌టాక్‌, వుయ్‌చాట్‌, హెలో వంటి 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా గతేడాది జూన్‌ 29న ఆయా యాప్‌లను నిషేధించింది. తర్వాత సెప్టెంబరులో దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రత వంటి అంశాలకు భంగం కలిగిస్తున్నాయని మరో 118 చైనా యాప్‌లను కేంద్రం బ్యాన్​ చేసింది.

ఆయా యాప్‌లు భారత్‌లో వినియోగదారుల డేటాను సేకరించి దేశం బయటకు అక్రమంగా తరలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దాదాపు ఇదే కారణాలతో తాజాగా 54 చైనా యాప్‌లను నిషేధించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. భారత్‌ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది.

ఇదీ చూడండి: ఆర్​పీఎఫ్​ బస్సు బోల్తా.. 13మంది జవాన్లకు తీవ్ర గాయాలు

Last Updated : Feb 14, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.