ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో మరో 34,457 కరోనా కేసులు

author img

By

Published : Aug 21, 2021, 9:54 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 34,457మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 375 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

Coronavirus India
కరోనా

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 34,457 మంది వైరస్ బారినపడ్డారు. మరో 375 మంది మరణించారు. ఒక్కరోజే 36,347 మంది కరోనా​ను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్​ కేసుల సంఖ్య 3,61,340గా ఉంది. 151 రోజుల తర్వాత ఇదే అత్యల్పం.

  • మొత్తం కేసులు: 3,23,93,286
  • మొత్తం మరణాలు: 4,33,964
  • మొత్తం కోలుకున్నవారు:3,15,97,982
  • యాక్టివ్ కేసులు:3,61,340

వ్యాక్సినేషన్..

దేశంలో శుక్రవారం 17,21,205 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,44,20,907‬కు చేరింది. ఒక్కరోజే 36,36,043 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 57,61,17,350 టీకా డోసులు పంపిణీ చేశారు.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,82,202 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 10,205 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,15,08,275కి చేరగా.. మరణాల సంఖ్య 44,26,737కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 151,108
  • బ్రెజిల్-​ 33,887
  • ఫ్రాన్స్-​ 22,319
  • బ్రిటన్​- 37,314
  • రష్యా- 20,992

ఇవీ చదవండి:

Vaccination in India: 'అందరికీ టీకా'తోనే.. థర్డ్​ వేవ్​కు అడ్డుకట్ట!
భారత్​లో పిల్లల టీకాకు అనుమతి

Vaccination: గర్భిణులకు టీకా.. దుష్ప్రభావాలు ఉన్నాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.