ETV Bharat / bharat

ఏపీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు.. 8వేల పోస్టులకు దరఖాస్తు ఇలా..

author img

By

Published : Jun 9, 2022, 7:00 PM IST

IBPS RRB recruitment 2022: ఐబీపీఎస్ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది. తెలంగాణ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 8వేలను పోస్టులను నింపాలని ఐబీపీఎస్​ భావిస్తోంది.

IBPS RRB recruitment 2022
ఐబీపీఎస్

IBPS RRB recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్( ఐబీపీఎస్​) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పలు ప్రభుత్వరంగ గ్రామీణ బ్యాంకుల్లో సీనియర్​ మేనేజర్​, మేనేజర్​, అసిస్టెంట్​ మేనేజర్​, ఆఫీస్​ అసిస్టెంట్​ పోస్టులను తాజా నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రతి ఏటా క్యాలెండర్​ ఇయర్​ ప్రకారం ఐబీపీఎస్​ నోటిఫికేషన్​ వస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విడుదలైంది. ఈ ఏడాదికి కాను.. దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఐబీపీఎస్​ ద్వారా 8వేల ఖాళీలను నింపనున్నారు.

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్​ 7వ తేదీ
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్​ 27వ తేదీ
  • ప్రీ ఎగ్జామ్​ ట్రైనింగ్​: జులై 18 నుంచి 23వరకు
  • ప్రిలిమ్స్​: ఆగస్టు, 2022
  • ప్రిలిమ్స్ ఫలితాలు: సెప్టెంబర్, 2022​
  • ప్రధాన పరీక్ష: సెప్టెంబర్​/ నవంబర్​, 2022

తెలంగాణ, ఏపీ గ్రామీణ్​ వికాస్​ బ్యాంకులతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో రూరల్​ బ్యాంకుల్లో గ్రూప్​ ఏ, గ్రూప్​ బీ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్​ ఏ కింద.. ఆఫీసర్​ స్కేల్​-1, ఆఫీసర్​ స్కేల్​-2, ఆఫీసర్​ స్కేల్​-3 పోస్టులు ఉంటాయి. గ్రూప్​ బీ కింద.. ఆఫీస్​ అసిస్టెంట్​ పోస్టులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు..

  • ఓబీసీ, జనరల్​ అభ్యర్థులు రూ. 850 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, వెనకబడిన తరగతి వర్గాల అభ్యర్థులు రూ. 175 చెల్లించాలి.

పూర్తి వివరాల కోసం.. https://www.ibps.in/ వెబ్​సైట్​ను సందర్శించండి.

ఇదీ చదవండి: డిగ్రీతో బ్యాంక్ అసిస్టెంట్‌ మేనేజర్​ ఉద్యోగం.. జీతం, దరఖాస్తు వివరాలు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.