ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

author img

By

Published : May 4, 2023, 6:28 AM IST

Horoscope Today : ఈ రోజు (మే 4) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

horoscope-today-telugu-may-3-horoscope-in-telugu-horoscope-daily
ఈ రోజు ఫలాలు

Horoscope Today : ఈ రోజు (మే 4) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

.

మీకు ఈ రోజు సంతోషంగా గడవడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ప్రతి రంగంలోనూ, మీరు విజేతగా నిలుస్తారు. ఈ అద్భుతమైన వాతావరణాన్ని ఉపయోగించుకుని మీరు మీ స్నేహితులతో, కుటుంబంతో ఎటైనా విహార యాత్రకు వెళ్లిరండి. సామాజికంగా కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ విషయాల్లోనూ మీరు దూసుకుపోతుంటారు. ఆర్థిక లాభం ఉంటుంది.

.

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కష్ట కాలం. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామిని దర్శించండి.

.

జీవితంలో విజయాలు అంత సులభంగా ఏమీ లభించవు. మీ కుటుంబ సభ్యులు ముందు నుంచి ఉద్రేకంగా ఉన్నారు. సహనం వహించండి. రోజంతా శాంతంగా ఉండడం నిజంగా చాలా కష్టం. కానీ మీకు ఇంట్లో ఉన్న ఇబ్బంది ఉద్యోగం చేసే చోట ప్రభావం చూపకుండా చూసుకోండి. విద్యార్థులు ఈ రోజు పెట్టే ఇబ్బందులను అధిగమించలేరు. మీరు సరదాగా గడిపినా.. కానీ మీ అసలైన లక్ష్యం మరిచిపోకండి. అనుకోని ఖర్చులు ఉన్నాయని గ్రహబలం చెబుతోంది. మీ పర్స్ ని చూసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు చెయ్యండి.

.

ఈ రోజు మీకు అనుకూల వాతావరణం ఉంది. ఇష్టమైన వారిని కలుసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

.

మీరు మీ ఆకర్షణీయమైన, అందమైన రూపంతోనూ, శాంత గంభీరమైన వైఖరితోనూ ఎందరో మనస్సులను గెల్చుకుంటారు. మీ కొలీగ్స్, మీ చుట్టుప్రక్కల ప్రజల సహకారం పొందడానికీ ఇది మార్గం సుగమం చేస్తుంది. అందుకే మీరు విజేత కాకుండా ఎవరూ ఆపలేరు. మీరు సున్నితంగా ప్రవర్తించడం వల్ల మీ కుటుంబ వాతావరణం కూడా చాలా హాయిగా నడుస్తుంటుంది. మీ పోటీదారులూ, మీరంటే గిట్టనివారూ కూడా వెనక్కి తగ్గి చేతులు ముడుచుకుని కూర్చోవలసినదే ఈ రోజు. మీరు జనంతో కలిసిపోగలగడం వల్లనే ఇన్ని అద్భుతాలూ జరుగుతున్నాయి. మీకు చెప్పగలిగే మాట ఒక్కటే సడన్​గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం వంటి పనులు చెయ్యకండి. కొంచెం ఆగీ ఆలోచించీ అప్పుడు ఆచరణలోకి దిగండి.

.

కన్యరాశి వారికి చాలా మంచి రోజు. ఆకట్టుకునే మాటతీరు ప్రజల్ని మీకు ఆకర్షితులయేలా చేస్తుంది. అందరి ఆరాధనకూ, ప్రేమకూ పాత్రులయేలా చేస్తుంది. మీ బాడీ లాంగ్వేజ్ మీ ప్రియమైన వారితోనూ, మీ మిత్రులతోనూ మీ రిలేషన్స్ అద్భుతంగా ఉంచుతుంది. మీ ఆదర్శాలకు ఎందరో ఆకర్షితులై, మీ ఆలోచనా రీతిని అనుసరించేందుకు ముందుకు వస్తారు. మీరు చర్చల్లో పాల్గొనే సమయంలోనూ, వక్తృత్వ పోటీల్లోనూ మీ తెలివీ, చాతుర్యం అందరికీ వెల్లడి అవుతుంది. మీకు వచ్చే రెస్పాన్స్ కూడా అమోఘంగా ఉంటుంది. మీ చర్చలు ఆరోగ్యకరంగా ఉన్నంత సేపూ మీరు విజేతలుగానే ఉంటారు. ఆర్థిక లాభాలూ, బిజినెస్ కలిసి రావడం కూడా జరుగుతుంది.

.

మీకు ఈ రోజు విపరీతమైన చికాకు కలుగుతుంది. మీరు మానసికంగానూ, శారీరకంగానూ బాగా అలిసిపోతారు. మీ ఉత్సాహం చల్లబడిపోవడం వల్ల కోపం ఎక్కువవుతుంది. మీ మిత్రులతోనూ, మీ ప్రియమైన వారితోనూ మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు వాదనలు పెట్టుకోకుండా,మీరు కొంచెం సమన్వయ ధోరణి ప్రదర్శించడం అవసరం. మధ్యాహ్నానికి, పరిస్థితి మెల్లగా మెరుగుపడుతుంది. ఆరోగ్యంలోగానీ, మీ స్వరంలోగానీ చెప్పుకోదగినంతగా మార్పు కనిపించదు. వీలయినంత వరకూ లీగల్ విషయాలు డీల్ చెయ్యకండి. మరీ తప్పనిసరి అయితే మాత్రం తగినంత జాగ్రత్త వహించండి.

.

మీ తారాబలం చాలా ప్రకాశవంతంగా, ఉదారంగా ఉంటుంది. ఆ ఔదార్యం మీకు ఆర్థికపరంగానూ, బిజినెస్, ప్రొఫెషనల్ లైఫ్​లో గొప్ప లాభాల రూపంగానూ కనిపిస్తుంది. మీరు మీ మిత్రులతోనూ, మీ ప్రియమైన వారితోనూ కలిసి ప్లెజర్ ట్రిప్​నకు వెళ్లవచ్చు. కానీ ఖర్చు విషయంలో తగు జాగ్రత్త వహించండి. మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. భోజనం ఎక్కువయిపోతోందని అనుకుంటే తినకుండా వదిలెయ్యండి. మీ చుట్టుప్రక్కల ఉండే వారిలో కొందరు అహంకార స్వభావులు ఉంటారు. వారితో నెగ్గడం చాలా కష్టం. అటువంటి సందర్భాలలో మీరు ఉండబట్టలేక ఏదో తగాదా తెచ్చుకోవచ్చు. అలాంటి పరిచయాలకు దూరంగా ఉండడం చాలా అవసరం.

.

ధను రాశి వారికి ఇది చాలా ఉదారమైన రోజు. అన్ని రంగాల్లోనూ పట్టుకుచ్చులా మెత్త మెత్తగా సాగిపోతుంది ప్రయాణం. మీ ఇంట్లోనూ, ఆఫీస్ లోనూ కూడా వాతావరణం అంత హాయిగానూ ఉండడమే దీనికి కారణం. మీ మిత్రులతోనూ , కుటుంబంతోనూ ఒక ప్లెజర్ ట్రిప్​నకు వెళ్లి వచ్చే అవకాశం ఉంది. జీతం పెంపుదల, ప్రమోషన్స్ అవకాశాలూ ఉన్నాయి. మీ గౌరవ ప్రతిష్ఠలు సొసైటీలో పెరుగుతాయి. ఆరోగ్య పరంగా, మీరు ఈ రోజు పర్ ఫెక్ట్ షేప్​లో ఉంటారు.

.

అనుకూల వాతావరణం ఉంది. విదేశీ ప్రయాణానికి శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవ దర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది. వృత్తి పరంగా బాగా రాణిస్తారు. ఆలయాల సందర్శన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

.

ఈ రోజు మీకు కొంత వ్యతిరేకంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. శివ స్తోత్రం సత్పలితాన్నిస్తుంది.

.

ఈ రోజంతా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రోజు మొదటి సగ భాగంలో మీ మిత్రులతోనూ, మీ ప్రియమైన వారితోనూ ప్లెజర్ ట్రిప్ ,ఎక్స్ కర్షన్ వంటి వాటిలో ఆనందంగా గడుస్తుంది. ప్రొఫెషనల్ రంగంలో కూడా, మీ నౌక స్మూత్​గా సాగిపోతుంది. అవగాహన, సహకార స్వభావం ఉన్న బిజినెస్ పార్ట్ నర్స్​తో ఉండడం వల్ల మీ బిజినెస్ బాగా ఉచ్చ దశకి చేరుకుంటుంది. మధ్యాహ్న సమయానికి,ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా పరిణమిస్తుంది. ఇంట్లో వేడి వేడి చర్చలు జరుగుతున్నా మీరు వాటికి దూరంగా ఉండి పోవడం చాలా మంచిది. లేకుంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని తిడతారు. ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.