ETV Bharat / bharat

గుజరాత్​లోనూ 'లవ్​ జిహాద్' చట్టం!

author img

By

Published : Feb 15, 2021, 12:21 PM IST

బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా లవ్ జిహాద్ చట్టం చేస్తున్న​ రాష్ట్రాల్లో గుజరాత్​ చేరనుంది. ఈ మేరకు త్వరలోనే కఠినమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు. వడోదర మున్సిపల్​ ఎన్నికల ర్యాలీలో విపక్షాలపై ఆరోపణలు గుప్పించారు.

Gujarat to bring law against 'love jihad', says CM Rupani
గుజరాత్​లోనూ 'లవ్​ జిహాద్' చట్టం

బలవంతపు మతమార్పిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు 'లవ్ జిహాద్' చట్టం చేసుకొచ్చిన రాష్ట్రాల్లో త్వరలోనే గుజరాత్​ చేరనుంది. ఇలాంటి మతమార్పిళ్లను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని త్వరలోనే ఆమోదించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదర ర్యాలీలో పాల్గొన్న రూపానీ.. గుజరాత్​లో స్వర్ణయుగం నడుస్తోందన్నారు.

" శాసనసభ సాక్షిగా లవ్ జీహాద్ చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇకపై ఇటువంటి కార్యకలాపాలను సహించబోము. భాజపా నేతృత్వంలో ఈ ఆగడాలపై కఠినమైన చట్టాలను తీసుకువస్తాం."

-విజయ్​ రూపానీ, గుజరాత్​ సీఎం

బలవంతపు మతమార్పిళ్లకు అడ్డుకట్ట వేసేందుకు భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​లు ఈ తరహా చట్టాలను చేశాయి.

గుండా యాక్ట్​..

సాధారణ ప్రజలను రౌడీల బారినుంచి తప్పించేందుకు.. 'గుండా'(అసాంఘిక) నిరోదక చట్టాన్ని చేశామని రూపానీ గుర్తుచేశారు. ఈ మేరకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి 10-14ఏళ్ల జైలు శిక్షను విధించే కఠిన నిబంధనలు పొందుపరిచామన్నారు. అలాగే రాష్ట్రంలో కబ్జాలను నిరోధించేందుకు సైతం చట్టం చేశామన్నారు.

స్వర్ణయుగం..

గుజరాత్​ పాలనలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందన్నారు రూపానీ. కేంద్రాన్ని ఏది అడిగినా.. కాదనకుండా ఇస్తుందని తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ప్రభుత్వం నర్మదా డ్యాం గేట్లు ఎత్తడానికి కూడా అనుమతులను ఇచ్చేది కాదని దుయ్యబట్టారు. మోదీ అధికారంలోకి వచ్చిన 17 రోజుల్లోనే గుజరాత్​ అభివృద్ధికి గేట్లు తెరిచారని తెలిపారు.

ఇదీ చదవండి: 'లవ్​ జిహాద్​' చట్టాల పరిశీలనకు సుప్రీం ఓకే

'మత స్వేచ్ఛ' బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం

'విద్వేష రాజకీయాలకు ప్రధాన కేంద్రంగా యూపీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.