ETV Bharat / bharat

గ్యాంగ్​ రేప్ బాధితురాలి భర్తను కాల్చి చంపి...

author img

By

Published : Sep 26, 2021, 3:15 PM IST

గ్యాంగ్​ రేప్ బాధితురాలి (Gang rape victim Delhi) భర్తపై కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వచ్చి హత్య చేసి పారిపోయారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.

gangrape victim
గ్యాంగ్ రేప్ బాధితురాలి భర్తపై కాల్పులు

సామూహిక అత్యాచార బాధితురాలి (Gang rape victim Delhi) భర్తను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. ఈశాన్య దిల్లీలోని దయాల్​పుర్ పోలీస్ స్టేషన్ (Dayalpur Police Station) పరిధిలో ఈ ఘటన జరిగింది.

కాల్పులు జరిపి పరార్..

చౌహాన్ బాగ్ ప్రాంతంలో అత్యాచార బాధిత మహిళ.. తన భర్త, చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 12.30 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి తలుపు కొట్టారు. భర్త వెళ్లి తలుపు తెరవగానే.. దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. పొరుగునే ఉంటున్న బంధువులకు సమాచారం అందించి.. తన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆ మహిళ. అయితే అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తేల్చారు.

గాజియాబాద్​లోని అంకుర్ నగర్​లో నివసించే మనీశ్ పవన్ పండిత్, 'టాటూ' అని పిలిచే మరో వ్యక్తితో కలిసి తన భర్తను హత్య చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ ఆరోపించారు.

గతంలో అత్యాచారం..

గాజియాబాద్​లో నివసించినప్పుడు తనపై గుడ్డు, మీరజ్, వసి, తమీజ్ అనే వ్యక్తులు అత్యాచారం చేశారని.. దీనిపై ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు మహిళ చెప్పారు. ఈ కేసులో తమీజ్ మినహా మిగిలినవారందరూ బయటకు వచ్చారని వివరించారు. కేసును ఉపసంహరించుకోవాలని పదేపదే ఒత్తిడి చేస్తుండటం వల్ల ఆ ప్రాంతాన్ని వదిలి చౌహాన్ బాగ్​కు వచ్చినట్లు మహిళ వెల్లడించారు. తన భర్త మాదకద్రవ్యాలు విక్రయించేవాడని ఫిర్యాదులో వెల్లడించారు.

ఈ ఘటనపై దయాల్​పుర్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.