ETV Bharat / bharat

Gadwala MLA Krishnamohan Reddy Election Invalidated : గద్వాల ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు.. 'సుప్రీం కోర్టులో తేల్చుకుంటా'

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 3:29 PM IST

Updated : Aug 24, 2023, 9:02 PM IST

bandla  Krishnamohan Reddy
Gadwala MLA Krishnamohan Reddy

15:21 August 24

Gadwala MLA Krishnamohan Reddy Election Invalidated : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు

Gadwala MLA Krishnamohan Reddy Election Invalidated గద్వాల ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు సుప్రీం కోర్టులో తేల్చుకుంటా

Gadwala MLA Krishnamohan Reddy Election Invalidated : శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్​ఎస్(BRS)​కు షాక్​ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేల ఎన్నిక అఫిడవిట్​ చెల్లదంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయం మరువకు ముందే.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​ రెడ్డి(Gadwala MLA Krishnamohan Reddy) ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు(Telangana High Court) తీర్పు వెలువరించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్​ అభ్యర్థి డీకే అరుణ(DK Aruna)ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్​ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్​ రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘించినందున రూ.2.50 లక్షల జరిమానా చెల్లించడంతో పాటు.. పిటిషనర్ డీకే అరుణకు రూ.50వేల చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల అఫిడవిట్ వివాదంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేయగా.. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది : 2018 అసెంబ్లీ ఎన్నికలో బీఆర్​ఎస్​ తరఫున గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్​ నుంచి డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణపై కృష్ణమోహన్​ రెడ్డి 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో కృష్ణమోహన్ తన ఆస్తులు, చలాన్లు, అప్పుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని డీకే అరుణ 2019లోనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈవీఎంలు కూడా ట్యాంపరింగ్ అయ్యాయని.. వీవీప్యాట్ లు లెక్కించాలని కోరారు. హైకోర్టులో ఎన్నిక వివాదంపై విచారణ జరుగుతుండగానే ఆమె బీజేపీలో చేరిపోయారు.

సుప్రీం కోర్టుకు వెళ్లనున్న గద్వాల ఎమ్మెల్యే : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విషయంపై ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. తనకు ఇంకా హైకోర్టు నోటీసులు రానందున వాదనలు వినిపంచలేక పోయాయని వివరించారు. హైదరాబాద్​లోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. తన వాదనను వినకుండా హైకోర్టు తీర్పును వెలువరించిందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్​ రెడ్డి ఆవేదన చెందారు. డీకే అరుణ ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చారు. కోర్టును ఆమె తప్పుదోవ పట్టించారన్నారు. ప్రజాకోర్టులో అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.

"హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెల్లనున్నాను. నాకు హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రానందున వాదనలు వినిపించలేకపోయాను. నా వాదనలు వినకుండానే ఉన్నతన్యాయస్థానం తీర్పును ఇచ్చింది. డీకే అరుణ ఆరోపణల్లో నిజం లేదు. కోర్టును ఆమెను తప్పుదోవ పట్టించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాను. డీకే అరుణ టూరిస్టు నాయకురాలు.. తాను నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిని. అంతిమంగా ప్రజాకోర్టులో ప్రజలే నిర్ణయిస్తారు." - కృష్ణమోహన్​ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే

Srinivasa Goud Election Affidavit Tampering Case : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక కేసులో ఏం చేద్దాం.. దిల్లీలో ఈసీ మల్లగుల్లాలు

Gadwala MLA Krishnamohan Reddy Disqualification : ఇప్పుడు హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్​ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేస్తే.. డీకే అరుణ కాంగ్రెస్​ ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పదవి కాలం దాదాపు ముగిసిపోయిన అధ్యయనంలాగే ఉంది.

Kothagudem MLA Election On HC : వనమా VS జలగం.. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల విషయంలో కూడా అంతే : కొత్తగూడెం నియోజకవర్గంలో 2018లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు.. బీఆర్​ఎస్​ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికలో ఎన్నిక అఫిడవిట్​లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని జలగం గతంలో హైకోర్టులో పిటిషన్​ వేశారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా వనమా బీఆర్​ఎస్​ పార్టీలో చేరిపోయారు.

Vanama Venkateswara Rao Election Controversy : అనేక వాదనలు విన్న తర్వాత ఈ ఏడాది జులై 25న వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని ప్రకటిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. అనంతరం రెండో స్థానంలో ఉన్న జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వనమా హైకోర్టులో స్టే కోరితే.. నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Supreme court on Vanama Petition : సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట.. హైకోర్టు తీర్పుపై స్టే

Vanama controversy : వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

Last Updated : Aug 24, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.