ETV Bharat / bharat

మహిళ అండాశయంలో 15కిలోల కణతి

author img

By

Published : Jun 18, 2021, 1:51 PM IST

ఓ మహిళ అండాశయంలో మూడేళ్లుగా పెరుగుతున్న కణతిని.. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు వైద్యులు. బిహార్​ రోహ్​తస్​లో ఈ ఘటన జరిగింది.

FIFTEEN KG TUMOR
మహిళ అండాశయంలో 15 కిలోల కణతి

బిహార్​ రోహ్​తస్​లో ఓ మహిళ అండాశయం నుంచి సుమారు 15 కిలోల కణతిని తొలగించారు. నారాయణ్​ వైద్య కళాశాల, ఆస్పత్రి వైద్యులు.. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీశారు. ప్రస్తుతం.. ఆ బాధితురాలి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

FIFTEEN KG TUMOR REMOVED FROM WOMAN OVARY IN ROHTAS
కణతిని చూపుతున్న వైద్య బృందం

మూడేళ్లుగా కడుపునొప్పి..

కర్​గహర్​కు చెందిన ఆర్తీ దేవికి మూడేళ్లుగా కడుపులో కణతి పెరుగుతున్నట్లు గుర్తించారు వైద్యులు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కారణమేంటో ఎవరూ కనుగొనలేకపోయారు. చివరకు నారాయణ్​ ఆస్పత్రిలో వైద్యులు.. ఆమెకు జీవం పోశారు.

అలాంటి కణతిల కారణంగా క్యాన్సర్​ వచ్చే అవకాశముందని భావించిన వైద్యబృందం.. దానిని పరీక్షించాల్సిందిగా ప్రయోగశాలకు పంపించింది.

ఇదీ చూడండి: అమ్మమ్మ షరతు- చనిపోయిన బాలుడు బతికొచ్చాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.