ETV Bharat / bharat

ఆజాద్​ మైదానానికి పోటెత్తిన కర్షకులు

author img

By

Published : Jan 25, 2021, 11:50 AM IST

మహారాష్ట్ర నలుమూలల నుంచి ముంబయిలోని ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చారు రైతులు. దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా సభ నిర్వహిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా.. మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు.

Farmers from various districts of the Maharashtra gather at Azad Maidan in Mumbai in protest against FarmLaws
ఆజాద్​ మైదానానికి పోటెత్తిన కర్షకులు

నూతన సాగు చట్టాలకు వ‌్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో నిర్వహిస్తున్న సభకు కర్షకులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి దాదాపు 10 వేల మంది రైతులు ఇప్పటికే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. ఈ రోజు ర్యాలీగా తరలివెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు.

Farmers from various districts of the Maharashtra gather at Azad Maidan in Mumbai in protest against FarmLaws
ఆజాద్​ మైదానానికి పోటెత్తిన కర్షకులు

కుటుంబ సమేతంగా ముంబయికి తరలివచ్చామని.. వ్యవసాయం లేకపోతే తామంతా రోడ్డుపై పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నిర్వహించే సభలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా.. మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు పాల్గొననున్నారు.

Farmers from various districts of the Maharashtra gather at Azad Maidan in Mumbai in protest against FarmLaws
ఆజాద్​ మైదానానికి పోటెత్తిన కర్షకులు

ఇదీ చూడండి: 'గణతంత్ర పరేడ్'​కు రైతుల రూట్​ మ్యాప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.