ETV Bharat / bharat

రోజుకు 65 లీటర్ల పాలు ఇచ్చే గోవును చూశారా?

author img

By

Published : Aug 6, 2021, 10:55 AM IST

Updated : Aug 6, 2021, 4:40 PM IST

సాధారణంగా గోవులు రోజుకు 10 నుంచి 20 లీటర్లు పాలు ఇస్తాయి. మంచిగా మేత వేస్తే.. మహా అంటే మరో ఐదు లీటర్లు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. కానీ హరియాణాలో ఓ ఆవు మాత్రం ఏకంగా 65 లీటర్లు ఇస్తోంది. అంతేగాకుండా పాలు ఎక్కువ ఇచ్చే గోవుల పోటీల్లో పాల్గొని.. యజమానికి కాసుల వర్షం కురిపిస్తోంది.

endeavor cow,  kildeep
రోజుకు 65 లీటర్ల పాలను ఇచ్చే గోవు

రోజుకు 65 లీటర్ల పాలు ఇచ్చే ఆవు

ఓ ఆవు రికార్డు స్థాయిలో రోజుకు 65 లీటర్ల పాలు ఇస్తోంది. దేశంలో అత్యధిక పాలు ఇచ్చే గోవుల పోటీల్లో పాల్గొని ఇప్పటికే పలు సార్లు బహుమతులు గెలుచుకుంది. ఉత్తర భారతదేశంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి రూ. 5 లక్షలు, పతకం సాధించింది. ఈ ఆవు హరియాణాలోని కర్నాల్​ జిల్లాలో దాదుపుర్​ గ్రామానికి చెందిన కుల్​దీప్​ సింగ్​ది.

endeavor cow,  kildeep
ఎండీవర్​ రకానికి చెందిన ఆవు

ఈసారి 100 లీటర్లు..

కుల్​దీప్​ సింగ్​ దగ్గర ఉన్న ఆవు.. ఎండీవర్​ రకానికి చెందింది. ఈ ఆవు నుంచి ప్రతి మూడు గంటలకు ఓసారి పాలు పితుకుతారు. సగటున గంటకు 2.5 లీటర్ల చొప్పున ఇస్తుంది. దీని యజమాని కేవలం ఈ ఒక్క ఆవు పాలతో నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నారు. అంతేగాక పోటీల్లో వచ్చే డబ్బులు అదనం. ఈ గోవు మరో బిడ్డకు జన్మనిస్తే ఈసారి రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తుందని కుల్​దీప్​ చెబుతున్నారు.

endeavor cow,  kildeep
కల్పతరువుతో కుల్​దీప్​ సోదరులు

ఈ గోవుకు భారీగానే ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. 35 కిలోల సైలేజ్​ గడ్డి, 20 కిలోల పచ్చిమేత,12 కిలోల ధాన్యపు పొట్టును మేతగా వేస్తారు. రోజుకు కనీసం నాలుగు సార్లు స్నానం చేయిస్తారు. అయితే ఈ గోవు దేశీయ రకం కాదని అంటున్నారు కుల్​దీప్​. ఇది పోలాండ్​ నుంచి దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. హోల్​స్టెయిన్​, ఫ్రీజర్​ జాతి ఎద్దుల వీర్యం నుంచి పుట్టినట్లు పేర్కొన్నారు.

మూడు గోవులు.. ముప్పై పతకాలు..

కుల్​దీప్​ దగ్గర ఎండీవర్​ ఆవు ఒక్కటే కాదు. ఇలాంటివి ఇంకా రెండు ఉన్నాయి. వాటిని కూడా పోటీల్లో ఉంచుతారు కుల్​దీప్​. ఇప్పటివరకు అవి 30కు పైగా పతకాలు తెచ్చిపెట్టినట్లు చెబుతున్నారు.

endeavor cow,  kildeep
పోటీల్లో వచ్చిన ప్రైజ్​మనీని చూపిస్తున్న కూల్​దీప్​
endeavor cow,  kildeep
కుల్​దీప్​ గోశాలలో ఉన్న ఆవులు

తరతరాలుగా...

చదువుపరంగా కుల్​దీప్​ డిగ్రీ పూర్తి చేశారు. కానీ అతనికి ఉద్యోగం చేయాలని అనిపించలేదు. దీంతో తన పూర్వీకుల నుంచి వస్తున్న పశుపోషణనే వృత్తిగా చేపట్టారు. వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని లాభసాటిగా మార్చారు. గోవుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. వాటిని కన్న బిడ్డల్లా చూసుకుంటే పశుపోషణకు మించిన ఆదాయం మరొకటి లేదని అంటారు కుల్​దీప్.

ఇదీ చూడండి: క్యాబ్‌ డ్రైవర్‌ చెంప దెబ్బ ఘటనలో ట్విస్ట్‌

Last Updated : Aug 6, 2021, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.