ETV Bharat / bharat

దేశ రాజధాని దిల్లీలో మరో 7వేల కేసులు

author img

By

Published : Nov 12, 2020, 10:42 PM IST

దేశంలో కొవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. దేశరాజధాని దిల్లీ, మహారాష్టలో వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దిల్లీలో తాజాగా 7,053 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4,67,028కి పెరిగింది.

India cases
దిల్లీలో మరో 7 వేల మందికిపైగా వైరస్

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్రలో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉంది. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కొవిడ్​ ఉద్ధృతి అధికంగా కనిపిస్తోంది. దిల్లీలో కొత్తగా 7,053 మందికి కొవిడ్ సోకింది. 104 మంది వైరస్​కు బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,67,028కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7,332కి పెరిగింది.

  • కేరళలో అత్యధికంగా 5,537 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 77,813. ఇప్పటివరకు వైరస్​ నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,28,529.
  • గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 4,496 మంది కరోనా బారినపడ్డారు. 112 మంది మరణించారు. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 17,36,329గా, యాక్టివ్ కేసుల సంఖ్య 84, 627గా నమోదైంది. ఇప్పటివరకు 16,05,064 మంది వైరస్​ నుంచి రికవరీ అయ్యారు.
  • బంగాల్​లో కొత్తగా 3,856 కరోనా కేసులు వెలుగుచూశాయి. 54 మంది వైరస్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసులు 4,20,840కి పెరగ్గా మృతుల సంఖ్య 7,506గా నమోదైంది. ప్రస్తుతం 32,185 యాక్టివ్​ కేసులున్నాయి.
  • రాజస్థాన్​లో కొత్తగా 2,176 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,19,327కు చేరింది. చివరి 24 గంటల్లో 13 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2,032కు పెరిగింది. ప్రస్తుతం 17,352 యాక్టివ్ కేసులున్నాయి.
  • తమిళనాడులో తాజాగా 2,112 మందికి కొవిడ్ సోకింది. 25 మంది మృతిచెందారు. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 7,52,521కి చేరింది. రాష్ట్రంలో 18,395 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 11,440 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు.

ఇదీ చదవండి:'జీవన్​ సేవ'తో కరోనా రోగులకు అండగా ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.