ETV Bharat / bharat

సన్యాసిగా మారనున్న యువ సైంటిస్ట్.. అమెరికాలో రూ.కోట్ల జీతం వదిలి ఆధ్యాత్మికం వైపు అడుగులు

author img

By

Published : Dec 20, 2022, 5:00 PM IST

రూ.కోట్లలో జీతం, పెద్ద ఉద్యోగాన్నిసైతం వదులుకుని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యాడు ఓ యువకుడు. అతడే మధ్యప్రదేశ్​కు చెందిన ప్రన్​సుఖ్​ కాంతేడ్​. ఆ యువకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో ఓ సారి తెలుసుకుందాం.

data scientist becomes jain monk
సన్యాసిగా మారబోతున్న యువకుడు

ఆ యువకుడికి అమెరికాలో ఉద్యోగం.. రూ.కోట్లతో జీతం.. కానీ అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే అలాంటి ఆడంబరమైన జీవితాన్ని వదులుకుని.. నిరాండంబర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యాడు. అతడే మధ్యప్రదేశ్​లోని దేవాస్​కు చెందిన ప్రన్​సుఖ్​ కాంతేడ్(28). డిసెంబర్ 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకోకున్నాడు మన్​సుఖ్​. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరుకానున్నారు. అదే రోజు మన్​సుఖ్​తో పాటు మరో ఇద్దరు యువకులు సన్యాస దీక్షను స్వీకరించనున్నారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసిన ప్రన్​సుఖ్.. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర చదివిన తర్వాత డేటా సైంటిస్ట్​గా స్థిరపడ్డాడు. అతడి జీతం ఏడాదికి అక్షరాలా రూ.1.25 కోట్లు. అయితే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రన్​సుఖ్​.. జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. దీంతో 2021 జనవరిలో అమెరికా నుంచి భారత్​కు తిరిగొచ్చేశాడు.
'శాశ్వతమైన ఆనందం కోసం నేను జైన సన్యాసి కాబోతున్నాను. చిన్నప్పటి నుంచి సన్యాసి కావాలన్న కోరిక నెరవేరబోతుంది' అని ప్రన్​సుఖ్ అన్నాడు. తమ కుమారుడు జైన సన్యాసి కాబోతుండడంపై అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.