ETV Bharat / bharat

కళాశాలలోనే విద్యార్థిని తల నరికేసిన ప్రేమోన్మాది

author img

By

Published : Oct 1, 2021, 1:30 PM IST

ప్రేమ పేరుతో యువతులు, బాలికలపై దారుణాలకు ఒడిగడుతున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి ఘటనే కేరళ కొట్టాయంలో జరిగింది. ప్రేమను ఒప్పుకోలేదని కళాశాల ప్రాంగణంలోనే తోటి విద్యార్థిని తల నరికేశాడు ఓ ప్రేమోన్మాది.

Collge Girl Was Brutally Beheaded
కళాశాలలోనే విద్యార్థిని తల నరికేసిన ప్రేమోన్మాది

కళాశాల ప్రాంగణంలోనే తోటి విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో తల నరికేశాడు. ఈ దారుణ సంఘటన కేరళ, కొట్టాయంలోని ఎస్​టీ థామస్​ కళాశాలలో జరిగింది.

బాధితురాలు వైకమ్​ తాలుకాలోని తలయోలపారంబు గ్రామానికి చెందిన నితినమోల్​(22)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె బీవీఓసీ మూడో సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.

నిందితుడు అభిషేఖ్​ బైజు.. కూతట్టుకులమ్​ తాలుకాలోని ఉప్పాని గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు. పరీక్ష కేంద్రం నుంచి వస్తున్న సమయంలో యువతిపై దాడి చేసి అభిషేక్​ బైజు తల నరికేసినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.