ETV Bharat / bharat

ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే డ్యూటీ.. సీఎం వరాల జల్లు

author img

By

Published : Jan 26, 2022, 12:14 PM IST

Govt employees 5 days work: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది ఛత్తీస్​గఢ్​ సర్కార్. పింఛను కోసం ప్రభుత్వం వాటా పెంపు సహా మరికొన్ని వరాలు ఇచ్చింది. రైతులకు కూడా శుభవార్త చెప్పింది.

Govt employees to work 5 days a week
Govt employees to work 5 days a week

Chattisgarh govt employees: గణతంత్ర వేడుకల వేళ ఉద్యోగులు, రైతులు, వేర్వేరు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పింది ఛత్తీస్​గఢ్​లోని భూపేశ్​ బఘేల్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వారంలో ఐదు రోజులు విధులకు హాజరైతే చాలని ప్రకటించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్ష్​దాయీ పింఛను యోజన కోసం ప్రభుత్వం చెల్లించే వాటాను 10 నుంచి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది.

రైతులకు కూడా తీపి కబురు చెప్పింది ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం. 2022-23 ఖరీఫ్​ సీజన్​ నుంచి.. పప్పు ధాన్యాలు అన్నింటినీ కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: ఆర్​ఆర్​బీ పరీక్షలను నిలిపివేసిన రైల్వే- వారికి వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.