ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. 14 యాప్​లు బ్లాక్​.. ఉగ్రవాదులు వాడుతున్నందుకే!

author img

By

Published : May 1, 2023, 11:50 AM IST

Updated : May 1, 2023, 12:15 PM IST

సమాచార చేరవేతకు ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న 14 మొబైల్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు.. పాకిస్తాన్‌ నుంచి ఈ యాప్‌ల ద్వారా సమాచారం అందుతోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాల నివేదికతో ఈ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

center ban pakistan apps in india
center ban pakistan apps in india

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న భద్రతా బలగాలు.. వారికి పాక్‌ నుంచి ముష్కరులకు అందుతున్న సమాచారంపై దృష్టి సారించారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఉగ్రవాదులకు సమాచారం చేరవేస్తున్న 14 మొబైల్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ 14 యాప్‌లను పాకిస్థాన్​ నుంచి ఆదేశాలు స్వీకరించేందుకు జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తికి ఈ 14 యాప్‌లను ముష్కరులు ఎక్కువగా వినియోగిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

ఈ 14 యాప్‌లను ఉగ్రవాదులు, ముష్కరుల మద్దతుదారులు పరస్పరం అనుసంధానం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని కేంద్రం తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు ముష్కరుల మద్దతుదారుల ఫోన్‌ను ట్రాక్‌ చేయడానికి యత్నించినప్పుడు.. ఈ యాప్‌లు వినియోగిస్తున్నట్లు తేలింది. కేంద్రం నిషేధించిన 14 యాప్‌లకు భారత్‌లో కనీసం ప్రతినిధి లేడని... ఈ యాప్‌ కార్యకలాపాలు ట్రాక్‌ చేయడం కష్టం కాబట్టి నిషేధిస్తున్నట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌విస్, విక్రమ్, మీడియా ఫైర్, బ్రియార్, బీ చాట్‌, నంద్‌బాక్స్‌. కోనియన్‌.. IMO, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను నిషేధించినట్లు వివరించారు.

జమ్ముకశ్మీర్‌లో భారత చట్టాలను గౌరవించని.. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే యాప్‌ల జాబితాను నిఘా వర్గాల సహకారంతో కేంద్రం సిద్ధం చేసింది. ఈ జాబితాలోని 14 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. మరికొన్నింటినీ కూడా నిషేధించే అవకాశం ఉంది.

ఇప్పటికే దాదాపు 250 యాప్స్​పై బ్యాన్​
గత కొన్నేళ్లుగా కేంద్రం దాదాపు 250 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారతను కాపాడటానికి, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని వీటిపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన షేరిట్‌, టిక్‌టాక్‌, వీఛాట్‌, హెలో, బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, ఈక్వలైజర్ అండ్‌ బాస్ బూస్టర్, వివా వీడియో ఎడిటర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేష్ లైట్ వంటి పాపులర్‌ మొబైల్‌ అప్లికేషన్లు ఉన్నాయి.

నిషేధించిన ప్రముఖ యాప్​లు ఇవే..!

  • స్వీట్ సెల్ఫీ హెచ్​డీ
  • బ్యూటీ కెమెరా
  • సెల్ఫీ కెమెరా
  • ఈక్వలైజర్ అండ్​ బాస్ బూస్టర్
  • క్యామ్​కార్డ్​ ఫర్​ సేర్స్​ఫోర్స్​ ఈఎన్​టీ
  • ఐలాండ్ 2
  • యాషెస్ ఆఫ్ టైమ్ లైట్
  • వివా వీడియో ఎడిటర్
  • టెన్సెంట్ ఎక్స్‌రివర్
  • ఆన్‌మియోజీ చెస్
  • ఆన్‌మియోజీ అరేనా
  • యాప్‌లాక్
  • డ్యూయల్ స్పేస్ లైట్
Last Updated : May 1, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.