ETV Bharat / bharat

Brother Killed Brother In Meerut : ఆస్తి కోసం అన్నను చంపి 'దృశ్యం' రేంజ్ స్కెచ్​.. ఇంతలోనే పోలీసులకు అడ్డంగా బుక్!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 6:04 PM IST

Updated : Oct 10, 2023, 8:02 PM IST

Brother Killed Brother In Meerut : ఆస్తి కోసం సొంత అన్నయ్యనే సినిమా స్టైల్​లో స్కెచ్​ వేసి హత్య చేశాడు ఓ తమ్ముడు. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కాగా, ఈ దారుణానికి తతడి తల్లి, సోదరి కూడా సహకరించడం గమనార్హం. ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

Brother Killed Brother In UP Meerut
Brother Killed Brother In Meerut

Brother Killed Brother In Meerut : ఆస్తి కోసం సొంత అన్నయ్యనే హత్య చేశాడు ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ జిల్లాకు చెందిన ఓ సోదరుడు. పైగా దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఇంట్లోని ఫ్యాన్​కు ఉరేసి నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ దారుణానికి అతడి సోదరి, తల్లి కూడా సహకరించడం గమనార్హం. కాగా, హత్య చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితులు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి అంత్యక్రియలు అనంతరం నిందితులను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. మేరఠ్​​ జిల్లాలోని లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అషియానా కాలనీలో వెలుగు చూసిందీ ఘటన.

ఇంట్లో నుంచి గెంటేశాడని..
లోహియా నగర్​కు చెందిన షెహ్​జాద్(మృతుడు) బట్టల వ్యాపారి. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అషియానా కాలనీలో సోదరుడు అక్రమ్​, తల్లి, సోదరితో కలిసి నివాసముంటున్నాడు. షెహ్​జాద్ తమ్ముడు అక్రమ్​ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ కారణంతో అతడిని ఇంటి నుంచి గెంటేశాడు అన్న షెహ్​జాద్. దీంతో అతడిపై కోపం పెంచుకున్నాడు తమ్ముడు అక్రమ్​. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం విషయంలో కూడా తరచూ గొడవలు జరిగేవి. ఇలా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఇలా నిత్యం గొడవలకు కారణమవుతున్న అన్న షెహ్​జాద్​ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అలా శనివారం రాత్రి ఇంటికి వచ్చిన అన్నను మట్లాడాలని ఓ గదిలోకి తీసుకెళ్లాడు అక్రమ్​. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో వెంట తెచ్చుకున్న ఓ ఇనుప రాడ్డుతో షేహ్​జాద్​ ఛాతీపై బలంగా కొట్టాడు అక్రమ్​. ఆపై కిందపడేసి గొంతు నులుముతూ వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో నిందితుడి సోదరి, తల్లి అక్కడే ఉన్నారు. వారి సాయంతో షెహ్​జాద్ మృతదేహాన్ని ఫ్యాన్​కు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అనుకున్న ప్రకారం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితులు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో షెహ్​జాద్ భార్య, పిల్లలు ఇంటి పైభాగంలో ఉన్న ఓ గదిలో నిద్రిస్తున్నారు.

పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ నిజం..
కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. షెహ్​జాద్​ తీవ్ర మనస్థాపానికి గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడని నిందితులు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్​మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆ సమయంలో శవాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు(నిందితులు) నిరాకరించారు. అయినప్పటికీ మృతదేహాన్ని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిచించి పోస్టమార్టం పరీక్ష చేయించారు పోలీసులు. సోమవారం వచ్చిన నివేదికలో షెహ్​జాద్​ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్యకు గురయ్యాడని వెల్లడైంది. దీంతో ముసలి కన్నీరు కారుస్తున్న అతడి సోదరుడు, తల్లి, సోదరిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఈ విచారణలో నిజం ఒప్పుకున్నారు నిందితులు. ఆస్తి కోసమే తన అన్నను చంపినట్లుగా షెహ్​జాద్​ సోదరుడు పోలీసుల ముందు అంగీకరించాడు. దీంతో హత్యకు సహకరించిన మృతుడి తల్లి, సోదరి సహా ప్రధాన నిందితుడైన అక్రమ్​పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.

"పోస్ట్​మార్టం పరీక్ష నివేదిక ఆధారంగా ఈ ఘటనపై విచారణ జరిపాం. విచారణలో భాగంగా నిందితులు అది ఆత్మహత్య కాదని.. తామే హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించామని ఒప్పుకున్నారు. షెహ్​జాద్​ శనివారం సాయంత్రం నమాజ్​కు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లుగా అతడి భార్య చెప్పింది. షెహ్​జాద్​ను గొంతు నులిమి చంపినట్లుగా సోమవారం పోస్ట్​మార్టం పరీక్ష నివేదికలో తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేశాము. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి తండ్రి మహ్మద్ ఇనామ్​ కొన్నేళ్ల క్రితమే మరణించారు."

- అమిత్ రాయ్​, పోలీసు అధికారి

Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్​-రే' లాంటిది: రాహుల్​ గాంధీ

Fake Notes Found In SBI : SBIలో నకిలీ నోట్ల కలకలం.. ఏకంగా RBIకే పంపిన బ్యాంకు అధికారులు

Last Updated : Oct 10, 2023, 8:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.