ETV Bharat / bharat

అంధురాలి ఆత్మవిశ్వాసం.. రెండు కళ్లు కోల్పోయినా.. యూట్యూబ్​లో వంటలు..

author img

By

Published : Jun 17, 2023, 7:36 AM IST

Updated : Jun 17, 2023, 10:04 AM IST

Blind Woman cooking YouTube Channel : అంధులు తమ పనులను తాము చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కర్ణాటకకు చెందిన ఓ అంధ మహిళ.. చక్కగా వంటలు చేస్తున్నారు. ఆ వంటలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీడియోలు తీసి యూట్యూబ్​లో పెడుతున్నారు. దీంతో కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మరి ఆ వీర మహిళ విజయగాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

blind woman cooking
blind woman cooking

అంధురాలి ఆత్మవిశ్వాసం

Blind Woman Cooking YouTube Channel : అరుదైన వ్యాధితో కంటి చూపును కోల్పోయినా బెదరలేదు ఓ మహిళ. భర్త, కుటుంబ సభ్యుల సాయంతో అనుకున్నది సాధించారు. ఆమే కర్ణాటకకు చెందిన భూమిక. ప్రస్తుతం తాను చేస్తున్న వంటలను యూట్యూబ్​లో పెట్టి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు భూమిక. అంతేగాక దేశంలోనే యూట్యూబ్ ఛానెల్​ ప్రారంభించిన మొట్టమొదటి అంధ మహిళ భూమికే కావడం విశేషం. మరి ఆమె సాధించిన విజయం వెనుక ఎవరున్నారో? ఎంత శ్రమించి.. ఇంతటి స్థాయికి చేరుకున్నారో ఓ సారి చూద్దాం.

భూమిక(40) తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని దొడ్డబల్లాపూర్​లోని సోమేశ్వర లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆమె గృహిణీ. అయితే భూమిక పుట్టుకతో అంధురాలు కాదు.. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఆమె చూపును కోల్పోయారు. 2010లో తలనొప్పికి ఉందని వైద్యుడిని సంప్రదించారు భూమిక. వైద్య పరీక్షల్లో ఆమెకు 'ఆప్టిక్ న్యూరోటిస్' అనే వ్యాధి ఉన్నట్లు బయటపడింది. ఈ వ్యాధి దాదాపు ప్రతి 5 లక్షల మందిలో ఒకరికి వస్తుంది. ఈ వ్యాధి రావడం వల్ల భూమిక కంటి చూపు మెల్లగా మందగించి.. 2018లో పూర్తిగా కంటి చూపును కోల్పోయారు భూమిక. దీంతో భూమిక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆమెకు తన భర్త సుదర్శన్, కుటుంబ సభ్యులు అండగా నిలిచారు.

blind woman cooking
వంట చేస్తున్న అంధురాలు భూమిక

అంధురాలైనప్పటికీ ఏదైనా సాధించాలనే కోరిక భూమిక మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ సమయంలోనే ఆమెకు ఏదైనా వినూత్నంగా చేయాలనే ఆశ పుట్టింది. ఆ సమయంలో భూమిక బంధువు ఒకరు యూట్యూబ్​లో వంటల వీడియోలను పెట్టి బాగా ఆదాయం సంపాదిస్తున్నాడని భూమికకు తెలిసింది. దీంతో భూమిక కూడా 'భూమిక కిచెన్' అనే​ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. బంధువుల సూచన మేరకు 2018లో యూట్యూబ్​లో ఓ ఛానెల్​ని ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఆమె యూట్యూబ్​లో అప్​లోడ్ చేసిన వీడియోలకు బాగా వ్యూస్ వచ్చాయి.

blind woman cooking
బల్ల మీద ఉన్న వంట పాత్రలను తీస్తున్న భూమిక

ఆమె పడిన కష్టం..
కంటి చూపు కోల్పోయిన తర్వాత భూమికకు వంట చేయడం పెద్ద సవాల్​గా మారింది. కుళ్లిన కూరగాయలను గుర్తించడం, కోయడం, మసాలా దినుసులను గుర్తించడం ఇబ్బందిగా మారింది. ఆమె బ్లైండ్ ఫ్రెండ్ లీ కుకింగ్ వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. అందులో వంట సామగ్రిని ఎలా గుర్తించాలో మెళుకువలు నేర్చుకున్నారు. అలా కూరగాయలను శుభ్రం చేయడం, కోయడం వంటివి తెలుసుకున్నారు. ఇప్పటివరకు భూమిక తన యూట్యూబ్ ఛానల్​లో వేలాది వంట వీడియోలను పెట్టారు. ఆమె యూట్యూబ్ ఛాన్​ల్​కు 79,300 మంది సబ్​స్కైబర్లు ఉన్నారు. ఆమె పెట్టిన వీడియోలకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. దీంతో భూమిక కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ వంట చేసుకునే విధంగా.. సింపుల్​గా, తక్కువ పదార్థాలతో వండడం ఆమె ప్రత్యేకత.

blind woman cooking
వంటగదిలో భూమిక

"నేను రుచికరంగా, శుభ్రంగా వంట చేయడానికి కారణం నా భర్త, కుటుంబ సభ్యుల మద్దతు. నేను చేసిన వంటలను వీడియో తీసి నా భర్త యూట్యూబ్​లో పెడతారు. యూట్యూబ్‌లో నా వంటలు బాగా పాపులర్ కావడానికి ఆయనే కారణం. కొన్నిసార్లు నా భర్త సుదర్శన్​ నాకు ప్రత్యేకమైన వంటకాల గురించి చెబుతారు. అంతేకాకుండా మా అత్తామామ మద్దతు నాకు ఎప్పడూ ఉంటుంది."

--భూమిక

blind woman cooking
వంటలు చేస్తున్న అంధురాలు భూమిక
Last Updated : Jun 17, 2023, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.