ETV Bharat / bharat

Bhuvaneshwari Chandrababu Mulakat : చంద్రబాబు ఉక్కుమనిషి.. చిల్లర పనులతో మానసిక క్షోభకు గురిచేయలేరు : భువనేశ్వరి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:44 PM IST

Bhuvaneshwari Chandrababu Mulakat : చంద్రబాబును అరెస్టు చేసి ఆనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జైలులో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని భువనేశ్వరి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై ఆందోళన చేస్తున్న మహిళలను హింసిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

bhuvaneshwari_chandrababu_mulakat
bhuvaneshwari_chandrababu_mulakat

Bhuvaneshwari Chandrababu Mulakat : చంద్రబాబు ఉక్కుమనిషి.. ఆయన ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పది.. చిల్లర పనులతో ఆయన్ను మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మాట్లాడుతూ టీడీపీ అంటే ఒక కుటుంబం.. కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని భువనేశ్వరి తెలిపారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు.

Nara Bhuvaneshwari Questioned YSRCP Government : చంద్రబాబు ఏం తప్పు చేశారని అరెస్టు చేశారు.. ఆయన ప్రజల మనిషి : భువనేశ్వరి

టీడీపీ జెండా కోసం.. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి (Bhuvaneshwari) తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని, అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారని బాధను వ్యక్తం చేశారు. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు.

Chandrababu Case in ACB Court చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

కార్యకర్తలే వెన్నెముక.. టీడీపీ (TDP) కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదని పేర్కొన్నారు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు (Chandrababu) సం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం... ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదని పేర్కొన్నారు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారని చెప్పారు.

TDP Leaders Protest on Chandrababu Arrest: బాబు అరెస్టుపై ఆగని ఆందోళనలు.. విడుదల చేయాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు..

నారీశక్తిని నిలువరించలేరు.. చంద్రబాబు పాలనలోనే మహిళలకు రక్షణ ఉంటుందని నారా భువనేశ్వరి అన్నారు. బాబును అక్రమంగా అరెస్టు చేస్తే... ఆయనకు మద్దతుగా లక్షలాది మంది మహిళామణులు ఏకమై పోరాడుతున్నారని తెలిపారు. నారీశక్తిని ఎవరూ ఆపలేరని... హక్కుల కోసం ఎదురుతిరగాలని పిలుపునిచ్చారు. బాబును జైలులో పెట్టి అనవసరంగా రెచ్చగొడుతున్నారన్న ఆమె... చంద్రబాబు సింహంలా గర్జిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తారన్నారు.

TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు

Bhuvaneshwari Chandrababu Mulakat : చంద్రబాబు ఉక్కుమనిషి.. చిల్లర పనులతో మానసిక క్షోభకు గురిచేయలేరు : భువనేశ్వరి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.