ETV Bharat / bharat

'దిల్లీలో పుకార్లు వ్యాప్తి చేయకండి.. ఊరుకోము'

author img

By

Published : Mar 2, 2020, 10:26 PM IST

Updated : Mar 3, 2020, 5:21 AM IST

అల్లర్లపై పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరారు దిల్లీ పోలీసు కమిషనర్​ ఎస్​ఎన్​ శ్రీవాస్తవ. దేశ రాజధానిలో మత సామరస్యం, శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని సూచించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

We appeal to people to not spread rumours, disturb peace: Delhi Police chief
'దిల్లీలో పుకార్లు వ్యాప్తి చేయకండి.. ఊరుకోము'

'దిల్లీలో పుకార్లు వ్యాప్తి చేయకండి.. ఊరుకోము'

అల్లర్ల నుంచి కోలుకుంటున్న దిల్లీలో.. పుకార్లు వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని కోరారు దిల్లీ పోలీసు కమిషనర్​(శాంతిభద్రతలు) ఎస్​ఎన్​ శ్రీవాస్తవ. నగరంలో మత సామరస్యాన్ని కాపాడాలని సూచించారు.

అల్లర్లపై తప్పుడు వార్తలతో దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురైన మరుసటి రోజునే కమిషనర్​ ఈమేరకు వ్యాఖ్యానించడం. ప్రాధాన్యం సంతరించుకుంది.

పుకార్లు వ్యాప్తి చెందినప్పుడు వాటిలో నిజానిజాలు తేల్చుకునేందుకు తమ కంట్రోల్​ రూమ్​లకు ఫోన్​ చేయాలని సూచించారు శ్రీవాస్తవ.

"కొందరు దేశ విద్రోహులు.. అసత్య ప్రచారాలతో దిల్లీలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి అసత్య సమాచారాలు మీ దృష్టికి వస్తే... మా కేంద్ర, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్​కు ఫోన్​ చేయండి. మీ తొందరపాటు వల్ల ఇతరులకు కూడా నష్టం జరిగే అవకాశముంది. ఈ ప్రచారాలపై దిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ట్విట్టర్​, టీవీ మాధ్యమాల ద్వారా వీటిని ఖండిస్తున్నాం. పుకార్ల వ్యాప్తిపై ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశాం. ఆకతాయి పనులు, దేశ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం."

- ఎస్​ఎన్​ శ్రీవాస్తవ, దిల్లీ పోలీస్​ కమిషనర్​ (శాంతిభద్రతలు)

గత ఆదివారం సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ) అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘర్షణల్లో 47మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- ఉద్రిక్తతల మధ్య దిల్లీ విద్యార్థులకు 'పరీక్ష'

Last Updated : Mar 3, 2020, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.