ETV Bharat / bharat

కరోనా పంజా: 'మహా'లో 7 లక్షలకు చేరువలో కేసులు

author img

By

Published : Aug 24, 2020, 9:31 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. దిల్లీ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్​లలో మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.

cases in maharashtra reaches to 7 lakhs
కరోనా పంజా: 'మహా'లో 7 లక్షలకు చేరువలో కేసులు

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. కొత్తగా 11,015 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో బాధితుల సంఖ్య 6,93,398కి చేరింది. ఒక్కరోజే 212 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 22,465కి ఎగబాకింది.

రాజధానిలో

దిల్లీలో సోమవారం 1,061 కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1.62 లక్షలకు చేరింది. 13 మంది మరణంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి పెరిగింది.

  • తమిళనాడులో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మరో 5,967 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇవాళ 97 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 3,25,456కి, మరణాలు 6,614కి పెరిగాయి.
  • పంజాబ్​లో 1,516 మందికి తాజాగా కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 43,284కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 1,129 మంది మరణించారు.
  • గుజరాత్​లో సోమవారం 1,067 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,846కి చేరింది. మరో 13 మంది మరణంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,910కి పెరిగింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.