ETV Bharat / bharat

'పాక్​తో యుద్ధం ఎప్పుడు వస్తుందో చెప్పలేం'

author img

By

Published : Jan 20, 2020, 7:34 PM IST

Updated : Feb 17, 2020, 6:33 PM IST

సరిహద్దులో దాయాది పాకిస్థాన్​తో ఉద్రిక్తతలు, చొరబాటు యత్నాలు పెరిగిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు త్రిదళాధిపతి బిపిన్ రావత్. పాక్​తో యుద్ధం ఏ సమయంలో వచ్చేది చెప్పలేమన్నారు. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాల విస్తరణను.. భద్రత కోణంలోనే చూడాలని వ్యాఖ్యానించారు రావత్.

rawat
బిపిన్ రావత్

పాకిస్థాన్​తో యుద్ధం ఎప్పుడు వస్తుందో అంచనా వేయడం చాలా కష్టమని, అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రక్షణదళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయన్నారు త్రిదళాధిపతి బిపిన్​ రావత్.

తమిళనాడు తంజావూరులోని 'టైగర్​షార్క్స్​' వైమానిక స్థావరం వేదికగా వాయు దళాధిపతి ఆర్​కేఎస్​ బదౌరియాతో కలిసి సుఖోయ్​-30 ఎంకేఐ కొత్త స్క్వాడ్రన్​ను ప్రారంభించారు రావత్. దక్షిణ భారతంలో తొలిసారి మోహరించిన సుఖోయ్ 30 ఎంకేఐ శ్రేణి యుద్ధవిమానాలు గగనంతో పాటు సముద్రతలాన్ని పర్యవేక్షించనున్నాయని తెలిపారు.

త్రివిధ దళాలన్ని కలిపి సంయుక్త దళంగా ఏర్పాటు చేసే అంశమై సూచనాప్రాయంగా స్పందించారు రావత్. సంయుక్త దళ నిర్మాణంలో మనదైన విధానాన్ని అవలంబిస్తామన్నారు.

హిందూ మహాసముద్రంలో చైనా జాడపై

హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాల విస్తరణపై స్పందించారు రావత్. ప్రతి దేశం వారి భద్రతపై చర్యలు తీసుకుంటుందన్నారు. చైనా కార్యకాలాపాలను ఆ కోణంలోనే చూడాలన్నారు. ఏ దేశమైనా ఒక ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తుంటే అక్కడ తమ పట్టును పెంచుకునేందుకు యత్నిస్తోందని భావించాలని పేర్కొన్నారు.

అయితే భారత ప్రాదేశిక జలాల రక్షణలో భారత నౌకాదళం సమర్థంగా పనిచేస్తుందన్నారు. ఉన్నత శ్రేణి సుఖోయ్ విమానాలు హిందూ మహాసముద్రంలో భారత్​కు కీలకం కానున్నాయని అభిప్రాయపడ్డారు రావత్.

బిపిన్ రావత్

"భారత నౌకాదళం చాలా సమర్థమైంది. మన ప్రాదేశిక జలాల రక్షణను చేపడుతోంది. ఈ దక్షిణ భారత వైమానిక స్థావరం భారత నౌకాదళానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

సంయుక్త దళాల దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం. అయితే ఈ సంయుక్త దళం రూపొందించేందుకు త్రివిధ దళాలతో కలిసి పనిచేస్తున్నాం. మేం ఏ దేశానికి చెందిన రక్షణ విధానాన్ని అనుసరించబోం. భారత్​కు మనదైన అత్యున్నత యంత్రాంగాన్ని తయారుచేసేందుకు యత్నిస్తున్నాం. అయితే అది భారత్​కు నప్పుతుందో లేదో చూడాలి."

-బిపిన్ రావత్, త్రిదళాధిపతి

ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD30
SC-UNITECH
SC accepts Centre's proposal to takeover management control of Unitech
         New Delhi, Jan 20 (PTI) The Supreme Court Monday accepted the proposal of the Centre to take over the management control of embattled realty firm Unitech Limited.
         A bench headed by Justice D Y Chandrachud gave two months to the new board of Unitech to prepare the resolution framework of the company and sought its report.
         The bench, also comprising Justice M R Shah, granted 2-month moratorium to the new board from any legal proceedings against the company's management.
         It said the Board will appoint a retired apex court judge to monitor the preparation of resolution framework by the Board.
         The Centre had on Saturday told the apex court that it is agreeable to revisit its 2017 proposal to take over the management control of Unitech Ltd and complete its stalled projects for providing relief to around 12,000 hassled homebuyers.
         The Centre, in its six-page note submitted to the court, had said it is prepared to revisit its proposal of December 2017, to remove the existing management of Unitech Ltd and appoint 10 nominee directors of the government.
         The Centre had however said it would not infuse any funds for completion of pending projects of the company. It said the court should direct a moratorium for 12 months. PTI MNL LLP
SA
01201617
NNNN
Last Updated : Feb 17, 2020, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.