ETV Bharat / bharat

ఖతార్​ విమానం అత్యవసర ల్యాండింగ్- పురిటినొప్పులే కారణం

author img

By

Published : Feb 4, 2020, 2:52 PM IST

Updated : Feb 29, 2020, 3:35 AM IST

దోహా నుంచి బ్యాంకాక్​ బయల్దేరిన ​ఓ మహిళ భారత్​లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఖతార్​ ఎయిర్​వేస్​ విమానంలో ప్రయాణిస్తున్న ఆమె ఊహించని విధంగా ప్రస్తుతం కోల్​కతాలో అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అసలు ఏం జరిగిందంటే....

qatar-airways-flight-makes-emergency-landing-in-kolkata-thai-national-gives-birth-during-flight
థాయ్​లాండ్​ బిడ్డ భారత్​లో పురుడుపోసుకుంది

ఖతార్​ ఎయిర్​వేస్​ క్యూఆర్​-830 విమానం కోల్​కతాలో అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. ఏ సాంకేతిక లోపం వల్లో.. లేదా హైజాక్ లాంటి పెద్ద ముప్పులేవో అనుకుంటే పొరపాటే. దోహా నుంచి బ్యాంకాక్​కు ప్రయాణిస్తున్న ఓ మహిళ పురిటి నొప్పులే అత్యవసర ల్యాండింగ్​కు కారణం. ​

ఈ ఖతార్​ విమానంలో ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తోంది. థాయ్​ల్యాండ్​కు చెందిన ఆమెకు తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్యసేవల నిమిత్తం అత్యవసర ల్యాండింగ్​ చేయాలని నిర్ణయించారు. దగ్గర్లో ఉన్న కోల్​కతా విమానాశ్రయాన్ని సంప్రదించారు పైలట్లు.

వెంటనే స్పందించిన కోల్​కతా విమానాశ్రయ సిబ్బంది ల్యాండింగ్​కు అనుమతించారు. భారత వైద్యులు మహిళకు సేవలందించారు. అలా థాయ్​లాండ్​ బిడ్డ భారత్​లో పురుడుపోసుకుంది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారని తెలిపారు అధికారులు.

ఇదీ చదవండి:చిన్నారికి బలవంతంగా మద్యం తాగించిన రౌడీ డాడీ!

ZCZC
PRI GEN NAT
.MUMBAI BOM3
MH-TRAIN-SNAG
Mumbai: Track glitch disrupts suburban train services
         Mumbai, Feb 4 (PTI) Hundreds of commuters faced
hardships on Tuesday morning after suburban services of the
Central Railway were disrupted due to a technical snag at a
track changing point near Byculla station in south Mumbai,
officials said.
         The glitch occurred around 11.15 am which affected
services on both fast and slow lines and led to bunching of
trains on three tracks near Byculla station for sometime, they
said.
         The suburban services of the Central Railway were
delayed by 15 to 20 minutes, causing inconvenience to daily
commuters.
         Because of the problem, there was overcrowding in
several other trains on the Central Railway (CR) route.
         "There was a snag in the track changing point near
Byculla station. The problem was rectified and services
resumed at 11.35 am," Central Railway's chief public relations
officer Shivaji Sutar said.
         This was the second major disruption of the CR's
suburban services in last 24 hours.
         On Monday night, local trains services were halted for
sometime due to a track fracture at Kalyan station in
neighbouring Thane district.
         The Central Railway daily operates around 1,700
services on Mumbai's suburban network which are used by nearly
40 lakh commuters. PTI KK
GK
GK
02041255
NNNN
Last Updated : Feb 29, 2020, 3:35 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.