ETV Bharat / bharat

భగత్​ సింగ్​కు మోదీ, షా నివాళులు

author img

By

Published : Sep 28, 2020, 11:34 AM IST

భగత్​సింగ్​ 113వ జయంతిని పురస్కరించుకొని.. నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఆయన​ రగిలించిన ఉద్యమ స్ఫూర్తి.. దేశానికి ప్రేరణగా నిలుస్తుందని మోదీ, షా ట్విట్టర్​లో పేర్కొన్నారు.

PM Modi and Union minister Amit Shah pays tribute to Bhagat Singh
భగత్​ సింగ్​కు నరేంద్ర మోదీ, అమిత్​ షా నివాళులు

స్వాతంత్ర సమర యోధుడు భగత్​ సింగ్​ జయంతిని పురస్కరించుకొని.. ఘన నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ధైర్యసాహసాలు ఎన్నో ఏళ్లుగా దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ట్విట్టర్​ వేదికగా కొనియాడారు మోదీ.

  • मां भारती के वीर सपूत अमर शहीद भगत सिंह की जयंती पर उन्हें कोटि-कोटि नमन। वीरता और पराक्रम की उनकी गाथा देशवासियों को युगों-युगों तक प्रेरित करती रहेगी। pic.twitter.com/LMy2Mlpkol

    — Narendra Modi (@narendramodi) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'భరతమాత ముద్దుబిడ్డ భగత్​ సింగ్​ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. ఆయన ధైర్యం, శౌర్యం యుగాలుగా దేశానికి ప్రేరణగా నిలుస్తాయి.'

- నరేంద్ర మోదీ ట్వీట్​

అమిత్ ​షా కూడా..

భగత్​సింగ్​ 113వ జయంతి సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. ఆయనకు ఘన నివాళులర్పించారు. భగత్​ సింగ్​ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్​ చేశారు షా.

Union minister Amit Shah tweet
అమిత్​ షా ట్వీట్​

"విప్లవాత్మక ఆలోచనలు, గొప్ప త్యాగనిరతితో స్వాతంత్య్ర సంగ్రామానికి దిశా నిర్దేశం చేసి.. దేశ యువతలో స్ఫూర్తి రగిలించిన షాహీద్​ భగత్​ సింగ్​ ఎల్లవేళలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు."

- అమిత్​ షా ట్వీట్​

భగత్​ సింగ్​ గురించి..

భగత్​ సింగ్​ 1907 సెప్టెంబర్​ 28న పంజాబ్(పాక్​)​లో జన్మించారు. పిన్న వయసులోనే బ్రిటీష్​ పాలనను ధిక్కరించారు. దేశంలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించి గొప్ప యోధుడిగా నిలిచిన భగత్​ సింగ్​ను.. 23ఏళ్ల వయసులో 1931 మార్చి 23న పంజాబ్​లోని లాహోర్​లో ఉరితీశారు.

ఇదీ చదవండి: అభ్యుదయ కవితా యుగంలో ఆయన ఓ ధ్రువతార

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.