ETV Bharat / bharat

పెళ్లయిన ఐదురోజులకే మరో పెళ్లి!

author img

By

Published : Dec 20, 2020, 11:46 PM IST

Man flees after marrying 2 women in 5 days
ఐదురోజుల్లో రెండు పెళ్లిళ్లతో.. యువతుల జీవతాలు ఆగం..

ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడో ప్రబుద్ధుడు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్​వేర్​ కొలువు చేస్తున్న 26 ఏళ్ల వ్యక్తి ఇద్దరు యువతుల జీవితాన్ని నాశనం చేశాడు. అతగాడి చేతిలో మోసపోయిన ఓ మహిళా కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​కి చెందిన వ్యక్తి ఐదు రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ నెల 2న ఖండ్వాలో ఒక మహిళతో వివాహం జరిగింది. తరువాతి ఐదు రోజులకే అనగా డిసెంబర్​ 7వ తేదీన మోవ్​ పట్టణానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది

బయటపడిందిలా...

డిసెంబర్​ 7వ తేదీన మోవ్​లో నిందితుని వివాహ వేడుకకు హాజరైన మొదట పెళ్లితరపు వారు ఒకరు ఫోటోలు తీసి బంధువులకు పంపడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న రెండో వధువు కుటుంబ సభ్యులు సైతం నిందితునిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.

కట్నం భారీగానే...

పెళ్లైన రెండో రోజే భోపాల్​లో అత్యవసర పనిమీద వెళ్తున్నానంటూ నమ్మించిన నిందితుడు.. తాపీగా రెండో పెళ్లి చేసుకున్నాడు. తమవద్ద రూ.10లక్షలతో పాటు.. ఇంటిసామాగ్రిని కట్నంగా తీసుకున్నాడని మొదటి పెళ్లివారు వాపోయారు. డిసెంబర్​ 7తర్వాత మొబైల్​ స్విచాఫ్​ చేశాడని నిందితుని కోసం గాలిస్తున్నామని ఖండ్వా ఇన్స్పెక్టర్​ మండోలి తెలిపారు.

ఇదీ చదవండి: సంభోగానికి నిరాకరించిన వృద్ధుడి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.