ETV Bharat / bharat

పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట!

author img

By

Published : Aug 10, 2020, 11:31 AM IST

Updated : Aug 10, 2020, 6:04 PM IST

మనం వేసిన పంటలో ఒక్క పిట్ట కూడా వాలొద్దని.. దిష్టి బొమ్మలు పెడతాం. కొరడా చప్పుళ్లు చేసి తరిమేస్తాం. కానీ కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం తన పొలంలో ఎన్ని పక్షులొస్తే అంత ఆనందిస్తాడు. అవును.. ఆయన పంట వేసిందే పక్షుల కోసం. వినడానికి కొత్తగా ఉన్నా.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడెకరాల జొన్న పంటను పక్షులకే అంకితం చేశాడు ఆ బర్డ్ మ్యాన్. ఎందుకో తెలుసా?

karnatakas-birdman-grows-maize-in-three-acres-of-land-for-thousands-of-birds
పక్షుల కోసం మూడెకరాల్లో మొక్కజొన్న పంట!

పక్షుల కోసం మూడెకరాల్లో మొక్కజొన్న పంట!

'ప్రకృతి మనిషికి మాత్రమే సొంతమా? కోటానుకోట్ల జీవరాశులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే మానవుడు.. తనకు తాను భూమిని శాసిస్తాననుకోవడం సరైనదేనా? పాపం పక్షులు ఏం చేశాయని.. స్వేచ్ఛగా ఎగురుతూ విహరించాల్సినవి ఆకలి దప్పికలతో విలవిల్లాడుతూ మనిషి స్వార్థానికి, కరెంటు తీగలకు వేలాడాల్సిందేనా?' అచ్చం ఇలాంటి ప్రశ్నలే కర్ణాటకకు చెందిన ఓ రైతుకు తలెత్తాయి. అందుకే, తనవంతుగా పక్షుల కోసం మూడెకరాల్లో జొన్న పంట వేసేశాడు. 'బర్డ్ మ్యాన్'గా పేరు తెచ్చుకున్నాడు.

వేళ దేవనగరె జిల్లా, శ్యామనూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కొంకాలా.. లాక్​డౌన్​లో పశుపక్షాదుల ఆకలి కేకల వార్త చదివాడు. వెంటనే.. దాదాపు 40శాతం ఆదాయం పక్షుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు పక్షులు, చిన్న చిన్న జంతువుల కడుపు నింపేందుకు తన మూడెకరాల పొలంలో.. జొన్న పంట వేశాడు.

"లాక్​డౌన్ వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ బయట జంతువులు, పక్షులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రకృతి సంపదను కాపాడుకోవడం మన బాధ్యత. మనతోపాటే జీవరాశులన్నీ బతకాలి. మనం చెట్లు పెంచితే పక్షులు, జంతువులు వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి. అందుకే నా మూడెకరాల పొలంలో జొన్న పండించి వేలాది పక్షుల ఆకలి తీర్చుతున్నా."

-చంద్రశేఖర్ కొంకాలా, రైతు.

చంద్రశేఖర్ వేసిన పంట ఇప్పుడు పచ్చగా విరబూసింది. దీంతో పిట్టలు, పిచ్చుకలు, చిలుకలు, గిజిగాడు వంటి పక్షులు.. ఆనందంగా విహరిస్తున్నాయి. కడుపారా జొన్న గింజలను ఆరగిస్తున్నాయి. కిలకిల రావాలు వినిపిస్తూ.. చూపరుల మనసు దోచేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు చంద్రశేఖర్ కుటుంబసభ్యులు, స్థానికులు వీలైనప్పుడల్లా అటువైపు వెళ్తుంటారు.

ఇదీ చదవండి:ఆ నాటి 'మాల్గుడి డేస్​' మళ్లీ వచ్చేశాయి!

Last Updated : Aug 10, 2020, 6:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.