ETV Bharat / bharat

కర్ణాటకకు భారీ వర్ష సూచన- రెడ్​ అలర్ట్ జారీ

author img

By

Published : Aug 6, 2020, 11:21 AM IST

Updated : Aug 6, 2020, 11:36 AM IST

కర్ణాటకలో భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. విపత్తును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే అవసరమైన నిధులను ఆయా జిల్లాలకు విడుదల చేసింది.

Heavy Rain Forecast
కర్ణాటకకు భారీ వర్ష సూచన- రెడ్​ అలర్ట్ జారీ

కర్ణాటక మాల్నాడు, తీర ప్రాంతాలకు భారీ వర్షపాతం పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్​ అలర్ట్ ప్రకటించింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు రెవెన్యూ మంత్రి అశోక్‌ తెలిపారు.

Heavy Rain Forecast
కర్ణాటకకు భారీ వర్ష సూచన
vHeavy Rain Forecast
కర్ణాటకకు భారీ వర్ష సూచన
Heavy Rain Forecast
కర్ణాటకకు భారీ వర్ష సూచన
Heavy Rain Forecast
కర్ణాటకకు భారీ వర్ష సూచన

ఈ మేరకు అధికారులతో మాట్లాడారు అశోక్. రాష్ట్రంలో వర్షపాతం, అంచనాలు, రిజర్వాయర్లలో నీటిస్థాయి వంటి విషయాలపై అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, హసన్​ జిల్లాల్లో రెడ్​ అలర్ట్​ జారీ చేశారు.

"జలాశయాల ప్రవాహం పెరుగుతోంది. 11 జిల్లాల కలెక్టర్లతో సంప్రదించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. చిక్కమగళూరు జిల్లాలోని శ్రుంగేరి, ముడిగెరే ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక్కొక్కరికి రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని చెప్పాను."

- అశోక్​, కర్ణాటక రెవెన్యూ మంత్రి

విపత్తును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తోంది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పటికే అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాలకు అవసరమైన నిధులను విడుదల చేసింది.

మహారాష్ట్ర నుంచి నీళ్లు వదిలితే కొన్ని జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. కొడగు, ధార్వాడ్​, బెలగాం, దక్షిణ కన్నడ జిల్లాలకు ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలను పంపారు.

Last Updated : Aug 6, 2020, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.