ETV Bharat / bharat

సరిహద్దు రోడ్డు నిర్మాణాలపై రాజ్​నాథ్​ సమీక్ష

author img

By

Published : Jul 7, 2020, 12:59 PM IST

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్​నాథ్​కు వివరించారు అధికారులు.

Defence Minister Rajnath Singh reviewed the ongoing projects with Border Road Organisation Chief Lt Gen Harpal Singh
సరిహద్దు రోడ్డు నిర్మాణాలపై రాజ్​నాథ్​ సమీక్ష

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దులో రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మంగళవారం.. సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ) అధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

గంటకుపైగా జరిగిన ఈ భేటీలో.. బీఆర్​ఓ చీఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ హర్​పాల్​ సింగ్​.. వాస్తవాధీన రేఖ, నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను రాజ్​నాథ్​కు వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ప్రాజెక్టులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తామని రక్షణమంత్రికి హామీనిచ్చారు లెఫ్టినెంట్​ జనరల్​. ఇందుకోసం రక్షణ, హోం, రవాణా శాఖలు కలిసిగట్టుగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

గత రెండు నెలలుగా భారత్​-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభన కొనసాగుతోంది. గల్వాన్​ లోయ ఘటనతో ఈ వివాదం మరింత ముదిరింది. అనంతరం పరిస్థితిని అదుపు చేసేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించింది కేంద్రం.

ఇదీ చూడండి:- కశ్మీర్​ పుల్వామాలో ఎన్​కౌంటర్- జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.