ETV Bharat / bharat

అరుదైన శస్త్రచికిత్స.. 18కిలోల కణతి తొలగింపు

author img

By

Published : Jul 4, 2020, 8:12 PM IST

Updated : Jul 4, 2020, 8:32 PM IST

కర్ణాటకలో ఓ మహిళ కడుపులో నుంచి 18 కిలోల కణతిని విజయవంతంగా తొలగించారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. ఇంతటి భారీ కణతిని చూసి వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

A great Surgery from the Doctor: 18kg Tumour took out from the Stomach
18 కిలోల కణతిని తొలగించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు

కర్ణాటక చిక్​మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. ఓ మహిళ కడుపులో నుంచి 18కిలోల భారీ కణతిని విజయవంతంగా తొలగించారు.

A great Surgery from the Doctor: 18kg Tumour took out from the Stomach
18 కిలోల కణతి- సర్జరీకి ముందు

శివమొగ్గ జిల్లాకు చెందిన 45ఏళ్ల షఫురాభి కొద్ది కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. రోజురోజుకూ బరువు పెరుగుతూ వచ్చింది. పొట్ట భారీగా పెరిగిపోయింది. అయితే కొవ్వు కారణంగానే ఉదర భాగం పెరిగి ఉండొచ్చని ముందుగా అనుమానించింది షఫురాభి. కానీ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడింది. వైద్యులు స్కానింగ్ నిర్వహించగా.. కడుపులో భారీ కణతి ఉందని తేలింది.

A great Surgery from the Doctor: 18kg Tumour took out from the Stomach
శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు

వైద్యుల ఆశ్చర్యం

సర్జరీ కోసం చిక్​మంగళూరు జిల్లాలోని కొప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు షఫురాభి. ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాలకృష్ణ బృందం విజయవంతంగా కణతిని తొలగించింది. ప్రస్తుతం మహిళను పరిశీలనలో ఉంచారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.

అయితే 18 కిలోల కణతిని చూసి ఆస్పత్రి వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో కణతిని చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు.

ఇదీ చదవండి- లద్దాఖ్​ పర్యటనలో సింధూ నదికి మోదీ ప్రత్యేక పూజలు

Last Updated : Jul 4, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.