ETV Bharat / bharat

ప్రత్యామ్నాయ విద్యుత్​ పై ఆధారపడే వారు 13 శాతం మందే

author img

By

Published : Oct 28, 2020, 8:07 PM IST

దేశంలో వివిధ రకాల గ్రిడ్​ల నుంచి విద్యుత్​ను ఉపయోగించే ప్రజల శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో వెల్లడైంది. కేవలం పదమూడు శాతం మంది మాత్రమే కరెంట్​ కోసం ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడుతున్నట్లు స్పష్టమైంది.

87 pc households have access to grid-connected power; some still don't use electricity: Survey
ప్రత్యామ్నాయ విద్యుత్​ పై ఆధారపడే వారు 13 శాతం మందే:సర్వే

ఇంటి అవసరాల కోసం విద్యుత్​ని 87 శాతం మంది ప్రజలు దేశీయ గ్రిడ్​ల పై ఆధారపడుతున్నట్లు నీతి ఆయోగ్​, అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ చేపట్టిన ఉమ్మడి సర్వేలో తేలింది. కేవలం 13 శాతం మంది మాత్రమే కరెంట్​ కోసం ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించుకొంటున్నారని వెల్లడైంది. వీరిలో కొంతమంది విద్యుత్​ వినియోగించుకోని వారు కూడా ఉన్నారని తెలిపింది.

ఈ సర్వే పది రాష్ట్రాల్లో నిర్వహించగా.. పాతికవేల మంది పాల్గొన్నారు. ఈ సర్వే ప్రధానంగా విద్యుత్​ వినియోగదారుల సంతృప్తి, క్షేత్ర స్థాయిలో వినియోగం, వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలకు కరెంట్​ ఉపయోగించే వారిపై జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సర్వే ఫలితాలను స్మార్ట్ పవర్​ ఇండియా విడుదల చేసింది.

సర్వేలో వెల్లడైన ప్రధాన అంశాలు

  • 87 శాతం మంది విద్యుత్​ కోసం గ్రిడ్​లపై ఆధార పడుతున్నారు.
  • 13 శాతం ప్రజలకు కరెంట్​ అందుబాటులో లేకపోవడం లేదా సౌర విద్యుత్​ లాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
  • ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడిన వారిలో 62 శాతం మంది వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
  • నాలుగు శాతం మందికి విద్యుత్​ సరఫరా లేదు.
  • 66 శాతం ప్రజలు విద్యుత్​ సరఫరాపై సంతృప్తిగా ఉన్నారు.
  • పట్టణ జనాభాలో 75 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా... గ్రామీణుల్లో మాత్రం సంతృప్తిదారుల శాతం 63గా ఉంది.
  • విద్యుత్​ వినియోగంలో ఉత్తర్​ప్రదేశ్​ ఇతర రాష్ట్రాల కంటే వెనకంజలో ఉంది.
  • 20 ఏళ్లలో గ్రిడ్​ పవర్​ను ఉపయోగించకునే వారి సంఖ్య 59.4 శాతం పెరిగింది.

దేశంలో వంద శాతం గృహాలకు విద్యుత్​ సరఫరా కల్పించినపట్టకీ... స్థిరమైన సేవలను కొనసాగించడం పెద్ద సవాలుగా మారిందని స్మార్ట్​ పవర్​ ఇండియా సీఈవో ముఖర్జీ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించే సమయం ఆసన్నమైందని తెలిపారు.

ఇదీ చూడండి: ఈ దీపావళికి కొనుగోళ్లు అంతంత మాత్రమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.