ETV Bharat / bharat

కరోనా​పై భారత్​- అమెరికా శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధన

author img

By

Published : Sep 3, 2020, 9:30 AM IST

కరోనా సవాళ్లను పరిష్కారాలను కనుగొనేందుకు భారత్​, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయనున్నారు. ఇందుకోసం 11 బృందాలను నియమించాయి ఇరు దేశాలు. 'యూఎస్​-ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్​' కొవిడ్​- 19 నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

India-US scientists
భారత్​, అమెరికా

భారత్​- అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా కరోనా సమస్య పరిష్కారాల అన్వేషణ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టనున్నాయి. ఈ మేరకు 11 బృందాలను నియమించినట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. యూఎస్​-ఇండియా సైన్స్​ అండ్​ టెక్నాలజీ ఎండోమెంట్ ఫండ్​ (యూఎస్​ఐఎస్​టీఈఎఫ్) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

2020 ఏప్రిల్​లో వచ్చిన కొవిడ్​- 19 నిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కరోనా రోగ నిర్ధరణ, యాంటీవైరల్ చికిత్స, ఔషధాలు, వెంటిలేటర్​, క్రిమి సంహారక యంత్రాలు, లక్షణాలు గుర్తించే సెన్సార్లపై పరిధికి మించి అన్వేషించనున్నాయి ఈ బృందాలు. తద్వారా కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు, యంత్రాలను అభివృద్ధి చేయనున్నాయి.

శాస్త్ర సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపన కార్యకలాపాల కోసం యూఎస్​ఐఎస్​టీఈఎఫ్​ను స్థాపించాయి భారత్​, అమెరికా.

ఇదీ చూడండి: నేడు 'యూఎస్​ఐఎస్​పీఎఫ్'​ సదస్సులో ప్రసంగించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.