ETV Bharat / bharat

Assam Rifles Recruitment 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. అసోం రైఫిల్స్‌లో 161 టెక్నికల్​, ట్రేడ్స్​మెన్ పోస్టులు.. మహిళలూ అర్హులే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 10:36 AM IST

Assam Rifles Recruitment 2023 : అసోం రైఫిల్స్‌లో టెక్నికల్​, ట్రేడ్స్​మెన్ సహా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల అయ్యింది. ఈ పోస్టు​లకు పురుషులు సహా మహిళలు కూడా అర్హులే. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

assam rifles vacancy 2023
Assam Rifles Recruitment 2023

Assam Rifles Recruitment 2023 : అసోం రైఫిల్స్​లో ఖాళీగా ఉన్న వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. దీనికి సంబంధించి డిసెంబర్‌ నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్లు షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్​, డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్ట్​లకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. ఈ నోటిపికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు..
Assam Rifles Technical And Tradesman Recruitment : టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్​-బి, గ్రూప్​-సి): 161 పోస్టులు

ట్రేడులు..

1. బ్రిడ్జ్​ అండ్‌ రోడ్‌ (మేల్‌, ఫిమేల్‌)

2. రెలీజియస్‌ టీచర్‌ (మేల్‌)

3. లైన్‌మ్యాన్ ఫీల్డ్ (మేల్‌)

4. రికవరీ వెహికల్ మెకానిక్ (మేల్‌)

5. ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్ (మేల్‌, ఫిమేల్‌)

6. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మేల్‌, ఫిమేల్‌)

7. ప్లంబర్ (మేల్)

8. సర్వేయర్ ఐటీఐ (మేల్‌)

9. ఎక్స్-రే అసిస్టెంట్ (మేల్‌)

విద్యార్హతలు..
Assam Rifles Recruitment Eligibility : ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..
Assam Rifles Recruitment Selection Process : మొదట ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి రాత పరీక్ష ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థుల సర్టిఫికెట్​ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అందులో ఉత్తీర్ణులైనవారిని ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము..

  • గ్రూప్-బి పోస్టులకు రూ.200
  • గ్రూప్-సి పోస్టులకు రూ.100
  • ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ సైనికులకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
Assam Rifles Online Apply 2023

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేది : 2023 అక్టోబర్​ 21
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 నవంబర్​ 19
  • ర్యాలీ ప్రారంభం: 2023 డిసెంబర్​ 18 నుంచి

Indian Navy Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. ఇండియన్​ నేవీలో 224 ఉద్యోగాలు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

DRDO Recruitment 2023 : రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూనే.. రూ.37వేల జీతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.