ETV Bharat / bharat

'అమెరికా అమ్మాయి' విశాఖ కోడలైతే.. ఆవకాయ జున్నులా...

author img

By

Published : Sep 6, 2021, 10:18 AM IST

అబ్బాయిది ఇండియా.. అమ్మాయిది అమెరికా.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరచూ చూస్తూనే ఉంటున్నాము. వైజాగ్​వాసి అభిషేక్​ శామ్యూల్​ది కూడే ఇంచుమించు ఇదే కథ! అయితే ఈ కథలో మాత్రం కొంచెం 'ప్రియా పచ్చడి' స్టైల్​ను యాడ్​ చేసింది అభిషేక్​ ప్రేయసి హాన్నా. మరి ఈ తెలుగింటి 'అమెరికా' ఆడపడచు విశేషాలు మీరూ చూసేయండి...

Hannah samuel
హాన్నా శామ్యూల్​

వైజాగ్​ అబ్బాయి అభిషేక్​ శామ్యూల్​కు అమెరికా అమ్మాయి హాన్నా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో గతేడాది వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత హాన్నా జీవితం పూర్తిగా మారిపోయింది. తెలుగింటి ఆడపడచుగా హాన్నా తనను తాను తీర్చుదిద్దుకుంది. స్పూన్లు వదిలి, చేతులతో భోజనం చేస్తోంది. ముక్కుపుడక పెట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు అక్షరాలను చకచకా రాసేస్తోంది. ఎలాంటి తప్పులు లేకుండా తెలుగులో మాట్లాడేస్తోంది.

Hannah samuel
అభిషేక్​తో హాన్నా

ప్రపంచానికి భారతీయ సాంస్కృతిని పరిచయం చేయాలని నిర్ణయించుకుని ఇంకో అడుగు ముందుకేసింది హాన్నా. తన ఇన్​స్టాగ్రామ్​లో అనేక వీడియోలు పెడుతోంది.

Hannah samuel
హాన్నా శామ్యూల్​

"హాయ్​! నా పేరు హాన్నా. నేనో అమెరికన్​. ఓ భారతీయుడితో నాకు పెళ్లి జరిగింది. జీవితం అత్యద్భుతంగా ఉంది. అమెరికా-భారత్​ సంప్రదాయాల్లో ఉన్న వ్యత్యాసాలను ప్రపంచానికి తెలిజేయాలనుకుంటున్నా. విభిన్న ఆచారాల మధ్య బంధం అంటే ఎన్నో సవాళ్లుంటాయి. వాటిని కూడా చెప్పాలనుకుంటున్నాను. మాలాగే ఎవరైనా ఉంటే నన్ను ఫాలో అవ్వండి," అంటోంది తెలుగింటి అమెరికా ఆడపడచు.

'ప్రియా పచ్చడంటే చాలా ఇష్టం...'

భారతీయులు తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తుల వరకు, తెలుగు ప్రజలు చూసే సీరియళ్ల నుంచి ఇళ్లల్లో ఉండే వస్తువుల వరకు.. అమెరికాకు- ఇండియాకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఎంతో ఫన్నీగా చెప్పుకొస్తోంది హాన్నా.

హాన్నాకు ప్రియా పచ్చళ్లంటే చాలా ఇష్టమట. 'కొన్న రెండు రోజులకే పచ్చడి సీసా ఖాళీ అయిపోతోంది' అంటోంది.

అంతేకాదు.. తెలుగులో బంధాల పేర్లనూ చకచకా పలికేస్తోంది. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు, పిన్ని, బాబాయ్​, పెద్దనాన్న, పెద్దమ్మ.. ఇలా.. సంబంధాలతో సహా విడమరిచి మరీ చెబుతోంది.

అభిషేక్​తో బంధం చాలా బాగుందని, తన భర్త అన్ని విషయాల్లోనూ తనకు సహాయం చేస్తారని అంటోంది హాన్నా. అభిషేక్​ కుటుంబసభ్యులు కూడా తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని ఓ సందర్భంగా వెల్లడించింది.

Hannah samuel
అభిషేక్​-హాన్నా

అభిషేక్​ కూడా తన ఇన్​స్టా ఖాతాలో హాన్నాపై ప్రేమ గురించి రాసుకొచ్చాడు. 'తూర్పు పడమరను కలిస్తే.. కారం.. చక్కెరను కలిస్తే.. ఆవకాయ ఛీజ్​ను కలిస్తే.. బిర్యానీ బ్రెడ్​కు ముడివేస్తే ఎలా ఉంటుంది? మా బంధం కూడా అంతే!' అని హాన్నాతో గడిపిన క్షణాల గురించి వివరించాడు.

ఇవీ చూడండి:-

virtual marriage : ఆస్ట్రేలియాలో పెళ్లి... కర్నూలులో అక్షతలు..!

అంబర వీధిలో సంబరంగా వివాహం

కారులో పురోహితుడు.. వేదికపై వధూవరులు.. పెళ్లి ఎలా జరిగిందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.