ETV Bharat / bharat

ఆయన ఆర్మీ మేజర్, ఆమె సిటీ మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

author img

By

Published : Jul 14, 2021, 2:57 PM IST

మధ్యప్రదేశ్​లో ఓ ఆర్మీ మేజర్​, సిటీ మెజిస్ట్రేట్​ రూ.500 ఖర్చుతోనే పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో బ్యాండు బాజా, బరాత్​ లేకుండానే వివాహం జరిగింది. మంచి హోదాలో ఉండి కూడా ఇంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారని వీరిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి వేడుక కోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారని, దానికి తను వ్యతిరేకమని పెళ్లి కూతురైన మెజిస్ట్రేట్​ తెలిపారు.

amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పెళ్లి వేడుక అంటే సాధారణంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎంత లేదాన్నా రూ.లక్షల్లో ఖర్చవుతుంది. కానీ మధ్యప్రదేశ్​ ధార్​లో ఆర్మీ మేజర్ అంకిత్ చతుర్వేది, సిటీ మెజిస్ట్రేట్​ శివాంగి జోషి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. బ్యాండ్ బాజా, బరాత్ లేకుండా సింపుల్​గా కోర్టులోనే సంతకాలు చేసి ఒక్కటయ్యింది ఈ జంట. ఈ రిజిస్టర్ మ్యారేజ్​కు ఇరు కుటుంబాల సభ్యులు హాజరయ్యారు. ఖర్చయిన రూ.500 కూడా పెళ్లి దండలు, స్వీట్ల కోసం వెచ్చించిందే.

amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి
amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి
amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

భోపాల్​కు చెందిన శివాంగి జోషి, అంకిత్ చతుర్వేది వివాహం రెండేళ్ల క్రితమే నిశ్చమైంది. కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఉన్నత హోదాలో ఉన్నా తాము సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ పెద్దలకు చెప్పగా.. వారు కూడా అందుకు అంగీకరించారు. దీంతో ఎలాంటి ఆర్బాటాలు లేకుండా పెళ్లి తంతు సింపుల్​గా ముగించారు.

amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి
amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

అందుకే వాయిదా..

కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పెళ్లి వాయిదా వేసుకున్నట్లు పెళ్లి కూతురు, ధార్​ సిటీ మెజిస్ట్రేట్​ శివాంగి జోషి తెలిపారు. కరోనా కేసులు తగ్గుతున్నా వైరస్ ఇంకా అంతం కాలేదని గుర్తుచేశారు. కొవిడ్ జాగ్రత్తలను అందరూ తప్పకుండా పాటించాలన్నారు. పెళ్లి వేడుక కోసం చాలా మంది రూ.కోట్లు, లక్షలు ఖర్చు చేస్తుంటారని, దాని వల్ల పెళ్లికూతురు కుటుంబంపై భారం పడుతుందని శివాంగి అన్నారు. అందుకు తాను వ్యతిరేకమని, అందుకే నిరాడంబరంగా పెళ్లి వేడుక చేసుకున్నట్లు వివరించారు.

amazing-wedding-in-dhar-city-magistrate-and-army-major-got-married-by-spending-only-500-rupees
ఆయన ఆర్మీ మేజర్, ఆమె మెజిస్ట్రేట్​.. రూ.500 ఖర్చుతో పెళ్లి

కోర్టులో పెళ్లి అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అధికారిక ప్రక్రియ పూర్తి చేశారు నవ దంపతులు. ఆ తర్వాత ధార్​నాథ్ ఆలయానికి వెళ్లి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.

శివాంగి.. ధార్ నగర మెజిస్ట్రేట్​గా విధులు నిర్వహిస్తుండగా.. అంకిత్ చతుర్వేది లద్దాక్​లో ఆర్మీ మేజర్​గా సేవలందిస్తున్నారు.

ఇదీ చూడండి: Viral Video: వర్షం నీటిలో చిట్టి సింహం సరదా ఆటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.